షారోను వనములో పూసిన పుష్పమై

షారోను వనములో పూసిన పుష్పమై
లోయలలో పుట్టిన వల్లిపద్మమునై
నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు
ఆనందమయమై నన్నె మరిచితిని

1. సుకుమారమైన వదనము నీది – స్పటికము వలె చల్లనైన హృదయము నీది
మధురమైన నీ మాతల సవ్వడి వినగా – నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె
ప్రభువా నిను చెరనా !!షారోను!!

2. సర్వొన్నతమైన రాజ్యము నీది – సొగసైన సంబరాల నగరము నీది
న్యాయమైన నీ పాలన విధులను చూడగా – నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే
ప్రభువా నిన్ను మరతునా !!షారోను!!

3. సాత్వికమైన పరిచర్యలు నీవి – సూర్యకాంతిమయమైన వరములు నీవి
పరిమలించు పుష్పమునై చూపనా – ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా
ప్రభువా కృపతో నింపుమా !!షారోను!!

ప్రభువా నీ కలువరి త్యాగము

ప్రభువా నీ కలువరి త్యాగము – చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే”ప్రభువా”

1. నీ రక్షణయే ప్రాకారములని – ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి – 2
లోకములోనుండి ననువేరు చేసినది – నీదయా సంకల్పమే – 2 “ప్రభువా”

2. జీవపు వెలుగుగ నను మార్చుటకే – పరిశుద్ధాత్మను నాకొసగితివే – 2
శాశ్వత రాజ్యముకై నను నియమించినది – నీ అనాది సంకల్పమే – 2 “ప్రభువా”

3. సంపూర్ణునిగా నను మార్చుటకే – శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే – 2
పరిపూర్ణ శాంతితో నను కాచుటయే – నీ నిత్యసంకల్పమే – 2″ప్రభువా”

త్రియేక దేవుడైన

త్రియేక దేవుడైన యెహోవాను

కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు

పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని

గాన ప్రతి గానములు చేయుచు ఉండును

1. నా శాపము బాపిన రక్షణతో

నా రోగాల పర్వము ముగిసేనే

వైద్య శాస్త్రములు గ్రహించలేని

ఆశ్చర్యములెన్నో చేసినావే. || త్రియేక ||

2. నా నిర్జీవ క్రియలను రూపు మాపిన

పరిశుద్ధాత్మలో ఫలించెదనే

మేఘ మధనములు చేయలేని

దీవెన వర్షము కురిపించినావే. || త్రియేక ||

3. నా స్థితిని మార్చిన స్తుతులతో

నా హృదయము పొంగిపొర్లేనే

జలాశయములు భరించలేని

జలప్రళయములను స్తుతి ఆపెనే  || త్రియేక ||

మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే

పల్లవి: మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే
మహదానందమే తనతో జీవితం
ఓ మనసా ఇది నీకు తెలుసా!

1. దివ్యమైన సంగతులెన్నో నీ ప్రియుడు వివరించగా
ఉత్సాహ ధ్వనులతో వూరేగితివే
ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా
దిగులు చెందకే ఓ మనసా

౹౹మనసా౹౹

2. ఆశ్చర్య కార్యములెన్నో నీ ప్రియుడు చేసియుండగా
సంఘము ఎదుట నీవు సాక్షివైతివే
ఇహలోక శ్రమలన్ని స్వల్పమేగా
కలవరమేలనే ఓ మనసా

౹౹మనసా౹౹

3. నిష్కళoకరాలవు నీవని నీ ప్రియుడు నిను మెచ్చెనే
కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే
దుష్టుల క్షేమము నీ కంట బడగా
మత్సరపడకే ఓ మనసా

౹౹మనసా౹౹

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా
చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన
నీ నేత్రాలంకృతము (2)

పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో
క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2)
ఆప్యాయతకు నోచుకొనని
నను చేరదీసిన కృపా సాగరా (2)        ||చూచుచున్న||

అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు
తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2)
అగ్ని వంటి శోధనలను
తప్పించితివే దయా సాగరా (2)          ||చూచుచున్న||