అక్షయుడా నా ప్రియ యేసయ్యా

అక్షయుడా నా ప్రియ యేసయ్యా | Akshayuda | Hosanna Ministries 2025 New Album Song-4


Lyrics: Telugu

అక్షయుడా నా ప్రియ యేసయ్యా
నీకే నా అభివందనం (2)
నీవు నా కోసమే తిరిగి వస్తావని
నేను నీ సొంతమై కలిసి పోతామని
యుగయుగములు నన్నేలు తావని
నీకే నా ఘన స్వాగతం     || అక్షయుడా ||

1. నీ బలిపీఠ మందు పక్షులకు వాసమే దొరికెనే
అది అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించు నే
నేనే మందును ఆకాంక్షితును
నీతో ఉండాలని కల నెరవేరునా
నా ప్రియుడా యేసయ్యా..
చిరకాల ఆశను నెరవేర్చు తావని మదిలో చిరు కోరికా
 ‌                                                || అక్షయుడా ||
2. నీ అరచేతిలో నన్ను చెక్కుకొని మరువలేదంటివే
నీ కనుపాపగా నన్ను కాచుకొని దాచుకుంటావులే
నన్ను రక్షించిన ప్రాణమర్పించిన
నన్ను స్నేహించిన నన్ను ముద్రించిన
నా ప్రియుడా యేసయ్యా…
పానార్పణముగా నా జీవితమును అర్పించుకున్నానయా
 ‌                                                || అక్షయుడా ||
3. నీవు స్థాపించిన ఏ రాజ్యమైన కొదవ లేకుండెనే
బహు విస్తారమైన నీ కృపయే మేలుతో నింపెనే
అది స్థిరమైనదై క్షేమము నొందనే
నీ మహిమాత్మతో నెమ్మది పొందెనే
నా ప్రియుడా యేసయ్యా…
రాజ్యాల నేలే శకపురుషుడా నీకు సాటెవ్వరు.
 ‌                                                || అక్షయుడా ||

 


Akshayudaa Naa Priya Yesayya | Hosanna Ministries 2025 New Album Song-4

Lyrics: English

Akshayudaa Naa Priya Yesayya
Neeke Naa Abhivandanam (2)
Neevu Naa Kosame Tirigi Vastaavani
Nenu Nee Sontamai Kalisi Pothaamani
Yugayugamulu Nanneelu Thaavani
Neeke Naa Gana Swaagatham
|| Akshayudaa ||

Charanam 1:
Nee Balipeetha Mandu Pakshilaku Vaasame Dorikene
Adi Apuroopamaina Nee Darshanam Kaligi Jeevinchune
Nene Mandunu Aakankshitunu
Neetho Undaalani Kala Neraverunaa
Naa Priyudaa Yesayya…
Chirakaala Aashanu Neraverchu
Thaavani Madilo Chiru Korikaa
|| Akshayudaa ||

Charanam 2:
Nee Arachetillo Nannu Chekkukoni Maruvaledantive
Nee Kanu Paapaga Nannu
Kaachukoni Daachukuntaavule
Nannu Rakshinchina Praanamarpinchina
Nannu Snehinchina Nannu Mudrinchina
Naa Priyudaa Yesayya…
Paanarpanamuga Naa Jeevitamunu
Arpinchukunnaanaa
|| Akshayudaa ||

Charanam 3:
Neevu Sthaapinchina Ye Raajyamaina
Kodava Lekundene
Bahu Vistaaramaina Nee Krupaye Melutho Nimpene
Adi Sthiramainadai Kshemmamu Nondane
Nee Mahimaatmato Nemmadi Pondere
Naa Priyudaa Yesayya…
Raajyaala Nelee Shakapurushudaa
Neeku Saatavvaru
|| Akshayudaa ||

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical

అద్వితీయుడా Album – 2023


అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును   (2)
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా
//అతి పరిశుద్ధుడా//
1. సర్వోన్నతమైన స్థలములు యందు
నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడు ఆశ్చర్యమే (2)
ముందెన్నడూ చవిచూడని
సరి క్రొత్తదైన ప్రేమామృతం (2)
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణం తీరదు ఏనాటికి  (2)
//అతి పరిశుద్ధుడా//
2. సద్గుణరాశి నీ జాడలను
నా యెదుట నుంచుకొని
గడచిన కాలం సాగిన పయనం
నీ కృపకు సంకేతమే (2)
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా  (2)
నా లోన ఏ మంచి చూసావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా (2)
//అతి పరిశుద్ధుడా//
3. సారెపై నున్న పాత్రగ నన్ను
చేజారి పోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను
నను సోలి పోనివ్వక  (2)
ఉన్నావులే ప్రతి క్షణమునా
కలిసి ఉన్నావులే ప్రతి అడుగునా  (2)
నీవేగా యేసయ్యా నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి  (2)
//అతి పరిశుద్ధుడా//

 


Ati Parishuddhuda sthuti naivedyamu | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical

అద్వితీయుడా Album – 2023

Lyrics: English

Ati Parishuddhuda sthuti naivedyamu
Neeke arpinchi keerthintunu (2)
Neeku naa pakshamai nanu deevinchaga
Neeku naa toduvai nanu nadipinchaga
Jeevinthunu neekosame
aashrayamaina naa Yesayya
// Ati Parishuddhuda //

1. Sarvonnatamaina sthalamulu yandu
Nee mahima vivarimpaga
Unnatamaina nee sankalpamu
Ennadu aashcharyame (2)
Mundennaḍu chavichoodani
Sari krotthadaina premaamrutam (2)
Neelonē daachāvu eenātikai
Nee runam teeradu enaātiki (2)
// Ati Parishuddhuda //

2. Sadgunaraashi nee jaadalanu
Naa eduta nunchukoni
Gadachina kaalam saagina payanam
Nee krupaku sanketame (2)
Krupa vembadi krupa pondaga
Maarānu madhuramuga nē pondaga (2)
Naa lōna ē manchi choosāvayya
Nee prema choopitivi naa Yesayya (2)
// Ati Parishuddhuda //

3. Saarepai nunna paatraga nannu
Chejaari ponivvaka
Shodhanalennō edirinchinanu
Nanu soli ponivvaka (2)
Unnaavule prati kshanamunā
Kalisi unnaavule prati adugunā (2)
Neevegaa Yesayya naa oopiri
Neevegaa Yesayya naa kaapari (2)
// Ati Parishuddhuda //