మనసెరిగిన యేసయ్యా

మనసెరిగిన యేసయ్యా
మదిలోన జతగా నిలిచావు (2)
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
నీ పత్రికనుగా మార్చావు (2)        ||మనసెరిగిన||

నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై
సాగిపోదును నేను ఆగిపోలేనుగా (2)
సాహసక్రియలు చేయు నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||

వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి
ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2)
ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||

మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా (2)
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||

ఆనందమే పరమానందమే

ఆనందమే పరమానందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము (2)       ||ఆనందమే||

పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు త్రాగనిచ్చితివే (2)
నా ప్రాణమునకు సేదదీర్చితివి
నీతియు శాంతియు నాకిచ్చితివే (2)       ||ఆనందమే||

గాఢాంధకారము లోయలలో నేను
సంచరించినా దేనికి భయపడను (2)
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే (2)       ||ఆనందమే||

నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేసావు (2)
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము (2)       ||ఆనందమే||

నా ప్రాణమా నాలో నీవు – ఎందుకిలా కృంగియున్నావు ?

నా ప్రాణమా నాలో నీవు - ఎందుకిలా కృంగియున్నావు ? 
దేవునివలన ఎన్నోమేళ్ళను అనుభవించితివే 
స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా ? 

ఎందుకిలా జరిగిందనీ - యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని 
సహించి స్తుతించే - కృప నీకుంటే చాలునులే 

నా హృదయమా ఇంకెంత కాలము - ఇంతక నీవు కలవరపడుదువు 
దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే 
అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా ?             || ఎందుకిలా ||

నా అంతరంగమా నీలో నీవు - జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా 
దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు మరచిపోకుమా 
బ్రదుకు దినములన్నియు నీవు - ఉత్సాహగానము చేయుమా || ఎందుకిలా |

నేను యేసును చూచే సమయం

నేను యేసును చూచే సమయం – బహు సమీపమాయనే
శుభప్రదమైన యీ నిరీక్షణతో – శృతి చేయబడెనే నా జీవితం 

అక్షయ శరీరముతో - ఆకాశ గగనమున 
ఆనందభరితనై - ప్రియయేసు సరసనే పరవసించెదను || నేను ||

రారాజు నా యేసుతో వెయ్యేండ్లు పాలింతును 
గొర్రెపిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును      || నేను || 

అక్షయ కిరీటముతో అలంకరించబడి 
నూతన షాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను  || నేను ||

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం
యేసయ్యా సన్నిధినే మరువజాలను
జీవిత కాలమంతా ఆనదించెదా యేసయ్యనే ఆరాధించెదా

1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము
నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి
నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే

2. యేసయ్య నామమే బలమైన ధుర్గము
నాతోడై నిలచి క్షేమముగా నను దాచి
నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే

3. యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించె సువాసనగా నను మార్చె
నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే