నా విమోచకుడా యేసయ్యా

నా విమోచకుడా యేసయ్యా

నీ జీవన రాగాలలో….
నీ నామమే ప్రతిధ్వనించెనే
నీ జీవన రాగాలలో….
నీ నామమే ప్రతిధ్వనించెనే
నా విమోచకుడా యేసయ్యా….

1. నీతిమంతునిగా నన్ను తీర్చి
నీదు ఆత్మతో నను నింపినందునా ||2||
నీవు చూపిన నీ కృప నే మరువలేను ||2||    ||నా విమోచకుడా||

2. జీవ వాక్యము నాలోన నిలిపి
జీవమార్గమలో నడిపించి నందునా ||2||
జీవాధిపతి నిన్ను నే విడువలేను ||2||     ||నా విమోచకుడా||

3. మమతలూరించె వారెవరు లేరని
నిరాశల చెరనుండి విడిపించినందునా ||2||
నిన్ను స్తుతించకుండా నే నుండలేను ||2||   ||నా విమోచకుడా||

వీనులకు విందులు చేసే యేసయ్య  సుచరిత్ర

వీనులకు విందులు చేసే యేసయ్య  సుచరిత్ర
వేగిరమే వినుటకు రారండి
ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి     ||వీనులకు||

రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
రండి…                 ||వీనులకు||

 

రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
రండి…                 ||వీనులకు||


సృష్టి కర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా (2)
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
రండి…                 ||వీనులకు||

నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా

నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
నీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2)
నాకెంతో ఆనందం…

ఏ అపాయము నను సమీపించక
ఏ రోగమైనను నా దరికి చేరక (2)
నీవు నడువు మార్గములో నా పాదము జారక
నీ దూతలే నన్ను కాపాడితిరా (2) ||నాకెంతో||

నా వేదనలో నిన్ను వేడుకొంటిని
నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని (2)
నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
నా కన్న తండ్రివై కాపాడుచుంటివా (2) ||నాకెంతో||

నూతన యెరూషలేం నా గమ్యమేనని
నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా (2)
నీవుండు స్థలములో నేనుండ గోరెదను
నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా (2) ||నాకెంతో||

యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా 

యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)
విశ్వమంతా నీ నామము ఘణనీయము (2)         ||యేసయ్యా||

నీవు కనిపించని రోజున
ఒక క్షణమొక యుగముగా మారెనే (2)
నీవు నడిపించిన రోజున
యుగయుగాల తలపు మది నిండెనే (2)
యుగయుగాల తలపు మది నిండెనే          ||యేసయ్యా||

నీవు మాట్లాడని రోజున
నా కనులకు నిద్దుర కరువాయెనే (2)
నీవు పెదవిప్పిన రోజున
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే          ||యేసయ్యా||

నీవు వరునిగా విచ్చేయి వేళ
నా తలపుల పంట పండునే (2)
వధువునై నేను నిను చేరగా
యుగయుగాలు నన్నేలు కొందువనే (2)
యుగయుగాలు నన్నేలు కొందువనే          ||యేసయ్యా||

యేసయ్యా నీ కృపా

యేసయ్యా నీ కృపా – నను అమరత్వానికి

అర్హునిగా మార్చెను – యేసయ్యా నీ కృపా

|| యేసయ్యా ||

 

1.నీ హస్తపు నీడకు పరుగెత్తగా – నీ శాశ్వత కృపతో నింపితివా

నీ సన్నిధిలో దీనుడనై – కాచుకొనెద నీ కృప ఎన్నడు

|| యేసయ్యా ||

 

2.నీ నిత్య మహిమకు పిలిచితివా – నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా

ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన – ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును

|| యేసయ్యా ||

 

3.గువ్వవలె నే నెరిగి నిను చేరనా – నీ కౌగిటనే నొదిగి హర్షించనా

ఈ కోరిక నాలో తీరునా ? – రాకడలోనే తీరును

|| యేసయ్యా ||