ఆశ్రయదుర్గము నీవని రక్షణ శృంగము నీవేనని నా దాగుచోటు నీవేనని నా సమస్తమును నీవేనని నా మార్గములన్నింటిలో చీకటి అలుముకొననివ్వక నీ వెలుగుతో కప్పినావు - నీ తేజస్సుతో నింపినావు మరణాంధకారములో బంధించబడిన నీ జనులను మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు నీ ప్రభావ మహిమాలను నిత్యము ప్రకటించగా నీ ఆత్మతో నింపినావు - నాఆత్మకు తృప్తినిచ్చావు కరువు కోరాలలో నలుగుచూ వున్న నీ ప్రజలకు ఆకాశవాకిళ్లు తెరచి సమృద్థిగానే సంపదలిచ్చావు నా విశ్వాస ఓడను బద్దలుకానివ్వక నీ చేతితో నిలిపినావు - నీ కౌగిలిలో దాచినావు ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రియులను జ్ఞాప్తికి తెచ్చుకొని సజీవులుగానే దరికి చేర్చావు
yesanna songs
త్రియేక దేవుడైన
త్రియేక దేవుడైన యెహోవాను
కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని
గాన ప్రతి గానములు చేయుచు ఉండును
1. నా శాపము బాపిన రక్షణతో
నా రోగాల పర్వము ముగిసేనే
వైద్య శాస్త్రములు గ్రహించలేని
ఆశ్చర్యములెన్నో చేసినావే. || త్రియేక ||
2. నా నిర్జీవ క్రియలను రూపు మాపిన
పరిశుద్ధాత్మలో ఫలించెదనే
మేఘ మధనములు చేయలేని
దీవెన వర్షము కురిపించినావే. || త్రియేక ||
3. నా స్థితిని మార్చిన స్తుతులతో
నా హృదయము పొంగిపొర్లేనే
జలాశయములు భరించలేని
జలప్రళయములను స్తుతి ఆపెనే || త్రియేక ||