పల్లవి: సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానై యుండగా త్వరగా రానై యుండగా సంపూర్ణ సిద్ధి నొంద స్థిరపడెదము సంఘసహవాసములో ప్రేమసామ్రాజ్యములో 1. వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను ఏర్పరచబడినవారే తొట్రిల్లుచున్న కాలమిదే వీరవిజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికే విధేయులమై నిలిచియుందుము || సీయోను || 2. అధైర్యపడకు వదంతులెన్నో విన్నాను ఆత్మభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే నిత్యమహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో నిరంతరము ఆనందించెదము || సీయోను || 3. ఆశ్చర్యపడకు ఆకాశశక్తులు కదలినను దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యె కాలమిదే ఆర్భాటముగా రారాజు యేసు దిగివచ్చే వేళ రూపంతరము మనము పొందెదము || సీయోను ||
yesanna songs
నా ప్రార్థనలన్ని ఆలకించినావు
నా ప్రార్థనలన్ని ఆలకించినావు
నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము
నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను
నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు ||2|| || నా ప్రార్థనలన్ని ||
1. అడిగినంతకంటె అధికముగా చేయు
ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా ||2||
పరిపూర్ణమైన నీ దైవత్వమంతా
పరిశుద్ధతకే శుభ ఆనవాలు ||2|| || నా ప్రార్థనలన్ని ||
2. ఆపత్కాలములో మొరపెట్టగానే
సమీపమైతివే నా యేసయ్యా ||2||
సమీప భాందవ్యములన్నిటికన్నా
మిన్నయైనది నీ స్నేహబంధము ||2|| || నా ప్రార్థనలన్ని ||
3. ఎక్కలేనంత ఎత్తైన కొండపై
ఎక్కించుము నన్ను నా యేసయ్యా ||2||
ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు
ఆత్మీయతకే స్థిరపునాదులు ||2|| || నా ప్రార్థనలన్ని ||