నా గీతారాధనలో యేసయ్యా - నీ కృప ఆధారమే నా ఆవేదనలలో - జనించెనే నీ కృపాదరణ నీ కృప నాలో వ్యర్ధము కాలేదు - నీ కృపా వాక్యమే చెదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే || నా గీతా || చేనిలోని పైరు చేతికిరాకున్నా - ఫలములన్ని రాలిపోయినా సిరిసంపదలన్నీ దూరమైపోయినా - నేను చలించనులే నిశ్చలమైన రాజ్యముకొరకే - ఎల్లవేళల నిన్నె ఆరాధింతునే || నా గీతా || ఆత్మాభిషేకం - నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే ఆత్మతో సత్యముతో ఆరాధించుచు - నే వేచియుందునే నీ రాకడకై || నా గీతా ||
yesanna songs
విశ్వాసము లేకుండా దేవునికి
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు .......... హానోకు తన మరణము చూడకుండ పరమునకు ఎత్తబడి పోయెనుగా ఎత్తబడక మునుపే దేవునికి ఇష్టుడైయుండినట్లు సాక్ష్యమొందెను || విశ్వా || నోవహు దైవభయము గలవాడై దేవునిచే హెచ్చరించబడిన వాడై ఇంటివారి రక్షణకై ఓడను కట్టి నీతికే వారసుడని సాక్ష్యమొందెను || విశ్వా || మోషే దేవుని బహుమానము కొరకై ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి శ్రమలనుభవించుటయే భాగ్యమని స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను || విశ్వా || వీరందరు సాక్ష్యము పొందియున్నను మనము లేకుండా సంపూర్ణులు కారు అతి పరిశుద్ధమైన విశ్వాసముతో మరి శ్రేష్టమైన సీయోనుకే సిద్ధపడెదము || విశ్వా ||