నా ప్రాణమా నాలో నీవు - ఎందుకిలా కృంగియున్నావు ? దేవునివలన ఎన్నోమేళ్ళను అనుభవించితివే స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా ? ఎందుకిలా జరిగిందనీ - యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని సహించి స్తుతించే - కృప నీకుంటే చాలునులే నా హృదయమా ఇంకెంత కాలము - ఇంతక నీవు కలవరపడుదువు దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా ? || ఎందుకిలా || నా అంతరంగమా నీలో నీవు - జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు మరచిపోకుమా బ్రదుకు దినములన్నియు నీవు - ఉత్సాహగానము చేయుమా || ఎందుకిలా |
yesanna songs
నేను యేసును చూచే సమయం
నేను యేసును చూచే సమయం – బహు సమీపమాయనే
శుభప్రదమైన యీ నిరీక్షణతో – శృతి చేయబడెనే నా జీవితం
అక్షయ శరీరముతో - ఆకాశ గగనమున ఆనందభరితనై - ప్రియయేసు సరసనే పరవసించెదను || నేను || రారాజు నా యేసుతో వెయ్యేండ్లు పాలింతును గొర్రెపిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును || నేను || అక్షయ కిరీటముతో అలంకరించబడి నూతన షాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను || నేను ||