వర్ధిల్లెదము - మన దేవుని మందిరమందున నాటబడినవారమై నీతిమంతులమై - మొవ్వ వేయుదుము యేసు రక్తములోనే - జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే - జయము మనకు జయమే యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు ఆయన సన్నిధిలోనే నిలిచి - అనుభవింతుము ప్రతి మేలును || వర్ధి || యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు ఆయన సముఖములోనే నిలిచి - పొందెదము శాశ్వత కృపను || వర్ధి || పరిశుద్ధాత్ముని అభిషేకములో - ఎంతో ఆదరణ కలదు ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును || వర్ధి ||
yesanna songs
రాజ జగమెరిగిన నా యేసురాజా
రాజ జగమెరిగిన నా యేసురాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము - అనుబంధము విడదీయగలరా - ఎవరైనను - మరి ఏదైనను ? దీన స్థితియందున - సంపన్న స్థితియందున నడచినను - ఎగిరినను - సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ || బలహీనతలయందున- అవమానములయందున పడినను - కృంగినను - నీ కృపకలిగి యుందునే నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ || సీయోను షాలేము - మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము - ఈ ఆశ కలిగి యుందునే నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ ||