స్తుతి గానమా నా యేసయ్యా

Stuthi Gaanama Na yesayya | స్తుతి గానమా నా యేసయ్యా

స్తుతి గానమా - నా యేసయ్యా 
నీ త్యాగమే - నా ధ్యానము 
నీ కోసమే - నా శేష జీవితం          || స్తుతి ||

1.నా హీన స్థితి చూచి 
నా రక్షణ శృంగమై 
నా సన్నిధి నీ తోడని 
నను ధైర్యపరచినా … నా నజరేయుడా  || స్తుతి || 

2.నీ కృప పొందుటకు 
ఏ యోగ్యత లేకున్నను 
నీ నామ ఘనతకే 
నా శాశ్వత నీ కృపతో ...
నన్ను నింపితివా  || స్తుతి ||

స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము

స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము
హల్లెలూయ హల్లెలూయ-హల్లెలూయా హల్లెలూయా

1.ప్రభు ప్రేమకు నే పాత్రుడనా -ప్రభు కృపలకు నేనర్హుడనా
నను కరుణించిన నా యేసుని -నా జీవిత కాలమంత స్తుతించెదను |హల్లె | |స్తుతి |

2.యేసుని ప్రేమను చాటెదను -నా యేసుని కృపలను
ప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును -నా యేసు కొరకె నే
జీవింతును-హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా |హల్లె | |స్తుతి |