Yehovaa manakoraku goppa

Yehovaa manakoraku goppa
kaaryamulanu jesenani
manamu aanadinchedamu

1. Aayana yerparachina dinamidi
agupade manaku aashcharyamugaa
deeni yandu manamutsahinchuchu
santoshincheda mepudu “Yehovaa”

2. Thana sevakulu mora pettagane –
kanuparache prabhuvu ee stalamunu
mana mellaramu yekamugaa koodi –
mahimanu chaatedamu “Yehovaa”

3. Yaakobulo prabhu yedoshamunu
ishraayelulo ye vankara thanamun
kanugona ledu prabhu Yehovaa –
thanake stuti chellinthamu “Yehovaa”

4. Kreeste manaku moola raayai yunda –
pravakhtalu vesiri aa punaadi
daani meeda kattabaditimi manamu –
thana rakshana prakatintumu “Yehovaa”

5. Prathi kattadamunu aayana lone –
padilamugaa namarcha badinadai
ati sundarambaina gruhamugaa –
stutiyinchi sevinthumu “Yehovaa”

6. Mana prabhu yaina kreestesu nandu –
parishuddha aalayamuga manamu
nirmimpa baditimi ee bhuvi yandu –
saagila padi mrokkedamu “Yehovaa”

7. Ghana devaa neeve samasthamunu –
baagugaanu chesitivanuchu
stuti mahima prabhaavamulu
neeke Halleluyaa “Yehovaa”

యెహోవ మన కొరకు – గొప్ప కార్యములను
జేసెనని మనము ఆనందించెదము

1. ఆయన యేర్పరచిన దినమిది
అగుపడె మనకు ఆశ్చర్యముగా
దీనియందు మనముత్సహించుచు
సంతోషించెద మెప్పుడు
|| యెహోవ ||

2. తన సేవకులు మొరపెట్టగానే
కనుపరచెను ప్రభువు ఈ స్థలమును
మన మెల్లరమును యేకముగా – కూడి
మహిమను చాటెదము
|| యెహోవ ||

3. యాకోబులో ప్రభు యే దోషమును
ఇశ్రాయేలులో యే వంకరతనమున్
కనుగొనలేదే ప్రభు యెహోవా
తనకే స్తుతి చెల్లింతము
|| యెహోవ ||

4. క్రీస్తే మనకు మూలరాయైయుండ
ప్రవక్తలు వేసిరి ఆ పునాది
దానిమీద కట్టబడితిమి మనము
తన రక్షణ ప్రకటింతము
|| యెహోవ ||

5. ప్రతి కట్టడమును ఆయనలోనే
పదిలముగా నమర్చబడినదై
అతిసుందరంబైన గృహముగా
స్తుతియించి సేవింతుము
|| యెహోవ ||

6. మన ప్రభువైన క్రీస్తేసునందు
పరిశుద్ధ ఆలయముగ మనము
నిర్మింపబడితిమి ఈ భువియందు
సాగిలపడి మ్రొక్కెదము
|| యెహోవ ||

7. ఘనదేవా నీవే సమస్తమును
బాగుగాను చేసితి వనుచు
స్తుతి మహిమ ప్రభావములు
నీకే హల్లెలూయా
|| యెహోవ ||

Leave a Comment