పరిపాలించు పావనాత్మ దేవా

పల్లవి :-

పరిపాలించు పావనాత్మ దేవా అర్పించేదన్ బలిగా నన్నే నాధా “2”

పావనాత్మ దేవా నా బలమైయున్నవాడ “2” “పరిపాలించు”

1). నా తలంపులు నీవవ్వాలి – నా పలుకులు నీవవ్వాలి “2”

నడిపించు నన్ను అనుదినము “2”

నీ ఆశ నెరవేర్చుము (నాలో) “2” ” పరిపాలించు”

2). అద్భుతం చేయువాడ ఆదుకునే ప్రభువా “2”

గాయాలను మాన్పు వాడ “2”

కన్నీటిని తుడచువాడ (నా)”2″ ” పరిపాలించు”

3). నవ్యత నోసగుమయ్య నవ సృష్టిగ మార్చుమయ్యా “2”

కరిగించు రూపొందించు”2″

వినియోగించు నీ సేవకై (నన్ను) “2” “పరిపాలించు”

Leave a Comment