“నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను.” కీర్తన Psalm 146:2
పల్లవి: హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్ని వేళల యందున నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
1. వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే
నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్
2. నాదు శత్రువులను – పడద్రోయు వాడవు నీవే
మహా సామార్థ్యుడవు – నా రక్షణ శృంగము నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్
3. ఎందరు నిను చూచిరో – వారికి వెలుగు కలిగెన్
ప్రభువా నే వేలుగొందితిన్ – నా జీవంపు జ్యోతివి నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్
4. భయమును పారద్రోలి – అభయము నిచ్చితివి
ఎబినేజరు నీవై ప్రభు – నన్ను సంరక్షించుచుంటివి
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్
5. కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును
నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
6. ఈ జీవిత యాత్రలో – ఏమి సంభవించిన
మహిమా నీకే ఓ ప్రభూ – ఇదియే నా దీన ప్రార్థనా
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్