“నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను.” కీర్తన Psalm 119:65-72
పల్లవి : యెహోవా నీ యొక్క మాట చొప్పున
నీ దాసునికి మేలు చేసియున్నావు
1. మంచి వివేచన మంచి జ్ఞానమునకు – కర్త నీవే నాకు బోధ చేయుము
నీ యాజ్ఞలందు నమ్మిక నుంచితిని
|| యెహోవా ||
2. నాకు శ్రమ కలుగక మునుపు – నా దేవా నేను త్రోవ వీడితిని
నేడు నీ మాట నెరవేర్చు చున్నాను
|| యెహోవా ||
3. దేవా నీవు దయగలవాడవు – దేవా నీవు మేలు చేయుచున్నావు
నీ కట్టడల నాకు బోధించుము
|| యెహోవా ||
4. గర్విష్ఠులు నాకు విరోధముగా – కల్పించుదురెన్నో అబద్ధములు
నీ యుపదేశము లనుసరింతును
|| యెహోవా ||
5. వారి హృదయములు క్రొవ్వువలె – చాల మందముగానై యున్నవి
.ఆజ్ఞలలో ఆనందించుచున్నాను
|| యెహోవా ||
6. దేవా నేను నీ కట్టడలను – నేర్చుకొనునట్లు శ్రమల నొంది
యుండుట నాకు యెంతో మేలాయెను
|| యెహోవా ||
7. వేలాది వెండి నాణెముల కంటె – వేలాది బంగారు నాణెముల కంటె
నీ విచ్చిన ఆజ్ఞలు నాకు మేలు
|| యెహోవా ||