జయమని పాడు జయమని పాడు ప్రభుయేసునకే

“పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో…” ఎఫెసీయులకు Ephesians 1:18

పల్లవి : జయమని పాడు జయమని పాడు ప్రభుయేసునకే
మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే

1. ఆది అంతము అల్ఫ ఓమేగ ఆయనే ప్రభువు
ఆయన యేగా రానున్నవాడు శక్తిమంతుడు
|| జయమని ||

2. ప్రభు యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనెను
ప్రేమతో మమ్ము పవిత్ర పరచి నిర్దోషులుగ తీర్చె
|| జయమని ||

3. యేసులో మమ్ము రక్తముద్వారా విమోచించితివి
యెంతో కృపతో మమ్మును కడిగి మన్నించి నావుగా
|| జయమని ||

4. యేసులో మాకు యేశిక్షలేదు భయము బాపెగా
వాసిగ మరణబలము తొలగించి పాపము బాపెగా
|| జయమని ||

5. క్రీస్తులో మమ్ము నూతన పరచి తండ్రిని తెలిపెను
కరుణించి మమ్ము అంగీకరించె ఎంతో అద్భుతము
|| జయమని ||

6. మా స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆత్మ ముద్ర నిచ్చెను
మనోనేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణ నచ్చె
|| జయమని ||

7. ప్రభు క్రీస్తులో వాడబారని స్వాస్థ్యముగ నైతిమి
పరిశుద్ధులలో మహిమైశ్వరంబు యెంతో గొప్పది
|| జయమని ||

Leave a Comment