Oh bhakhtulaaraa mana mandaramu nityamu
yesuni stutiyinchedamu
1. Gatha kaalamuna mana prabhu yesu
nootana deevenalanu khyaatigaa nosage
manaku – stutiyincheda mesuni nootana
anubhavamulatho – khyaatigaa sarvashakhtuni “Oh”
2. Shakhti manthudu mana prabhu yesu
nityamunu deevinchunu – rakshinchunu manalanu
thaane – sampoornamugaa kaayaun – satyavanthudu
mana prabhuvu – maata thappani maharaaju “Oh”
3. Enni shodhanalu bhuvi nunna thaane manalanu
vidipinchunu – shodhimpa badenu yesu thana
sahaayamu nosagun – kanu paapavale prabhuvu
kaayun – nityamu niluchu manatho “Oh”
4. Shakhti manthudu mana prabhu yesu thotrilla
kunda kaapaadunu – nirdhoshulanugaa – prabhuvu
nilupunu thana mahimatho – thalachumu thana
krupalanu – ennadu viduvadu manala “Oh”
5. Krungina bhakhtulaaraa meeru – bhanga parchu
shatruvu pai jagamupai chaatudi –
jayamu jayamu jayamani prabhuke yuga yugamulu mana
prabhuke – Halleluya geetamulatho “Oh”
ఓ భక్తులారా మనమందరము
నిత్యము యేసుని స్తుతియించెదము
1. గత కాలమున మన ప్రభుయేసు
నూతన దీవెనలను – ఖ్యాతిగా నొసగె మనకు
స్తుతియించెద మేసుని
నూతన అనుభవములతో – ఖ్యాతిగా సర్వశక్తుని
|| ఓ భక్తులారా ||
2. శక్తిమంతుడు మన ప్రభు యేసు
నిత్యమును దీవించును – రక్షించును మనలను తానే
సంపూర్ణముగా కాయున్
సత్యవంతుడు మన ప్రభువు – మాట తప్పని మహారాజు
|| ఓ భక్తులారా ||
3. ఎన్ని శోధనలు భువినున్న
తానే మనలను విడిపించును – శోధింపబడెను యేసు
తన సహాయము నొసగున్
కనుపాపవలె ప్రభువు కాయున్ – నిత్యము నిలుచు మనతో
|| ఓ భక్తులారా ||
4. శక్తిమంతుడు మన ప్రభు యేసు
తొట్రిల్లకుండ కాపాడును – నిర్దోషులనుగా ప్రభువు
నిలుపును తన మహిమతో
తలచుము తన కృపలను – ఎన్నడు విడువడు మనల
|| ఓ భక్తులారా ||
5. కృంగిన భక్తులారా మీరు
భంగపర్చు శత్రువుపై జగముపై చాటుడి – జయము
జయము జయమని ప్రభుకే
యుగ యుగములు మన ప్రభుకే – హల్లెలూయ గీతములతో
|| ఓ భక్తులారా ||