Prabhu kristesu neeke maastutulu –
vibhudaa maadu stutule – nee haaramulu
1. Nee devundainatti nenu – neeku nityam – thodaiyunnaanu
neekemi thakkuva kaadanna priyudaa
2. Munupati kante adhikambaina melunu meeku kaluga jesedanu
ani protsaahinchina maa kristu prabhuvaa
3. Vistaara vendi bangaaram – entho unnadi – pani praaram –
bhinchi mandiramunu kattinchu manina prabhuvaa
4. Naa sanghamunu ne kattedanu – naatho meeru jatha panivaaranina
vintaina maa pradhaana shilpi kristu
5. Parvathamula nekki meeru mraanulan dechchi – naa
mandiramunu nirminchina santoshinthunanina
6. Sandhyaa raaga chandrabimbam – soorya kaanthi kalalan
meriseti sanghamugaa mammula roopincheda nanna
7. Aa divya bhagya maakepudo vinthaina nee raakada
naashinchi vechi yunnamilalo – praana priyudaa
ప్రభు క్రీస్తేసు నీకే మా స్తుతులు
విభుడా మాదు స్తుతులే – నీ హారములు
1. నీ దేవుండైనట్టి నేను – నీకు నిత్యం – తోడై యున్నాను
నీకేమియు తక్కువకా – దన్న ప్రియుడా
|| ప్రభు ||
2. మునుపటికంటె – అధికంబైన – మేలును మీకు – కలుగ జేసెదను
అని ప్రోత్సాహించిన మా – క్రీస్తు ప్రభువా
|| ప్రభు ||
3. విస్తార వెండి బంగారం – ఎంతో ఉన్నది – పని ప్రారంభించి
మందిరమును కట్టించు – మనిన ప్రభువా
|| ప్రభు ||
4. నా సంఘమును – నే కట్టెదను – నాతో మీరు – జత పనివారనిన
వింతైన మా ప్రధాన – శిల్పి క్రీస్తు
|| ప్రభు ||
5. పర్వతముల – నెక్కి మీరు – మ్రానులందెచ్చి – నా మందిరమును
నిర్మించిన సంతోషింతుననిన
|| ప్రభు ||
6. సంధ్యారాగ – చంద్రబింబం – సూర్యకాంతి – కళలన్ మెరిసేటి
సంఘముగా మమ్ముల రూ-పించెదనన్న
|| ప్రభు ||
7. ఆ దివ్య భాగ్యమా – కెపుడో – వింతైన నీ రాకడ నాశించి
వేచి యున్నామిలలో – ప్రాణ ప్రియుడా
|| ప్రభు ||