Betlehem puramuna – chitrambu kalige
karthaadi yesu – janminchinapudu
andhakarampu – prudhivi veedulalo
modampu mahima – chodyambuganare
1. Vudyampu taral – mudamuna baade
vudayincha yesu – Ee prudhivilona
mudamunu galige – mari samadhanam
padilambuthoda – poojincha randi “Betlehem”
2. Paramunu vidachi – nara roopametti
arudenche yesu – parama vaidyundai
narula dhukhamulan – tolaginchivesi
paraloka shanthi – sthiraparchi prabhuvu “Betlehem”
3. Needu chittamunu – naadu hrudayamuna
mudamuna jeya – madinentho yaasha
needu paalanamu – paramandu valene
Ee dharaniyandu – jaruganga jooda “Betlehem”
4. Devuni sannidhi – deenatha nunda
pavanayathma – pavithra parachun –
pavanudesu prakasha michichi
jeevambu nosagi – Jeevinchu Nedalo “Betlehem”
5. Gathinche raathri – prakashinche kaanthi –
vithaanamuga vikasinche nella
dootala dhwanito – pathi yesu christhu
athi prema thoda – arudenche noho “Betlehem”
బేత్లెహేం పురమున – చిత్రంబు కలిగె
కర్తాది యేసు – జన్మించినపుడు
అంధకారంపు – పృథివి వీధులలో
మోదంపు మహిమ – చోద్యంబుగనరే
1. ఉదయంపు తారల్ – ముదమున బాడె
ఉదయించ యేసు – ఈ పృథివిలోన
ముదమును గలిగె – మరి సమాధానం
పదిలంబుతోడ – పూజించ రండి
|| బేత్లెహేం ||
2. పరమును విడచి – నరరూపమెత్తి
అరుదెంచె యేసు – పరమ వైద్యుండై
నరుల దుఃఖములన్ – తొలగించివేసి
పరలోక శాంతి – స్థిరపరచె ప్రభువు
|| బేత్లెహేం ||
3. నీదు చిత్తమును – నాదు హృదయమున
ముదమున జేయ – మదినెంతో యాశ
నీదు పాలనము – పరమందు వలెనె
ఈ ధరణియందు జరుగంగఁ జూడ
|| బేత్లెహేం ||
4. దేవుని సన్నిధి – దీనత నుండ
పావనయాత్మ – పవిత్ర పరచున్
పావను డేసు – ప్రకాశమిచ్చి
జీవంబు నొసగి – జీవించు నెదలో
|| బేత్లెహేం ||
5. గతించె రాత్రి – ప్రకాశించె కాంతి
వితానముగ – వికసించె నెల్ల
దూతల ధ్వనితో – పతి యేసు క్రీస్తు
అతి ప్రేమతోడ – అరుదెంచు నోహో
|| బేత్లెహేం ||