Doota paata padudi

Doota paata padudi – rakshakun sthutinchudi
aa prabhundu puttenu – betlehemu nandunan
bhujanambu kellanu – soukhya sambramayenu
akasambunanduna – mrogu paata chaatudi
doota paata paadudi – rakshakun sthutinchudi

2. Oorthwa lokamanduna – golvaganu shuddhulu
anthya kalamanduna – kanya garbha manduna
buttinatti rakshaka – o immanuyel prabho
o naravatharuda – ninnu nenna sakyamaa ?
doota pata padudi – rakshakun sthutiyinchudi

3. Rave neeti sooryuda – raave devaputhrudaa
needu raakvallanu – loka sowkyamayenu
bhoonivasulu andari – mrutyu bheethi gelthuru
ninnu nammu vaariki naathma shuddhi kalgunu
doota paata paadudi – rakshakun sthutiyinchudi

దూత పాట పాడుఁడి – రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందునన్
భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను
ఆకశంబునందున – మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

2. ఊర్థ్వలోకమందున – గొల్వఁ గాను శుద్ధులు
అంత్యకాలమందున – కన్యగర్భమందున
బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుఁ డా – నిన్ను నెన్న శక్యమా
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

3. రావె నీతి సూర్యుఁ డా – రావె దేవపుత్రుఁ డా
నీదు రాకవల్లను – లోక సౌఖ్యమాయెను
భూనివాసులు అందరు – మృత్యుభీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి నాత్మశుద్ధి కల్గును
దూత పాట పాడుఁడి – రక్షకున్ స్తుతించుడి

Leave a Comment