Udayinche divya rakshakudu ghoraandhakaara
lokamuna mahima kristu udayinchenu –
rakshana velugu niyyanu (2)
1. Ghoraandhakaaramuna deepambu leka – palumaaru
paduchundagaa dhukka niraasha yaatrikulanthaadaari
thappi yundagaa marga darshiyai nadipinchu
vaarin – prabhu paada sannidiki divya rakshakudu
prakaasha velugu – udayinche ee dharalo “Uda”
2. Chintha vichaaramutho nindi yunna – lokarodanavini
paapambunundi nashinchipogaa – aatma
vimochakudu maanavaalikai maranambunondi –
nitya jeevamunivvan – divya rakshakudu
prakaasha thaara – udayinche rakshimpan “Uda”
3. Paraloka thandri karuninchi manala – pampenu
kristu prabhun lokaandhulaku drusti nivva –
aruthenche kristu prabhuvu – cheekatinundi
daiva velugu naku – thechche kristu prabhuvu
saataanu shrunkhalamulanu thempa – udayinche
rakshakudu “Uda”
ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియ్యను
1. ఘోరాంధకారమున దీపంబులేక – పలుమారు పడుచుండగా
దుఃఖ నిరాశ యాత్రికులంతా – దారితప్పియుండగా
మార్గదర్శియై నడిపించువారిన్ – ప్రభుపాద సన్నిధికి
దివ్యరక్షకుడు ప్రకాశ వెలుగు – ఉదయించె ఈ ధరలో
|| ఉదయించె ||
2. చింతవిచారముతో నిండియున్న – లోకరోదనవిని
పాపంబునుండి నశించిపోగా – ఆత్మవిమోచకుడు
మానవాళికై మరణంబునొంది – నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార – ఉదయించె రక్షింపను
|| ఉదయించె ||
3. పరలోక తండ్రి కరుణించి మనల – పంపెను క్రీస్తుప్రభున్
లోకాంధులకు దృష్టి నివ్వ – అరుదెంచె క్రీస్తు ప్రభువు
చీకటినుండి దైవ వెలుగునకు – తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంఖలములను తెంప – ఉదయించె రక్షకుడు
|| ఉదయించె ||