Yesuni shramalatoda

Yesuni shramalatoda – aashatho paalu pondedanu

A. P. : Yithani odaarpu nijamu – itara odaarpu vrudhaaye

1. Nindalella yekamuga – mahaa mahunimeeda badaga
vinthagane yorchukonenu – thandri maata neraverchen “Yesun”

2. Dhukhamuto nindiyunden – prakkalona gruchabadenu
rakhtitoda orchukoni virakhtimaata palkakunden “Yesun”

3. Shokambuchetha nenu – naakambu kadilintunu
rakhtambu dharaposen – rikhtulamain manaku “Yesun”

4. Sadayuni rakhtamuche – hrudayalankaaramuche
kalugu naaharamidiye – yellaraku shreshtaharam “Yesun”

5. Thalli prema kanna migula – thana prema chupe monapai
noti matatoda shatrun – kotala nashiyimpajesen “Yesun”

6. Naa yesu rakhta chemata – naayappu yantayun teerchen
yellariki nangeekaramide – yellappudu naa dhyanamun
“Yesun”

7. Halleluya geetamunu – yellappudu chatuchundun
yellariyandu taane – yellappudu vasinchun “Yesun

యేసుని శ్రమలతోడ – ఆశతో పాలు పొందెదను

అనుపల్లవి : ఇతని ఓదార్పు నిజము – ఇతర ఓదార్పు వృథయే

1. నిందలెల్ల ఏకముగా – మహామహునిమీద బడగా
వింతగానే యోర్చుకొనెను – తండ్రి మాట నెరవేర్చెన్
|| యేసుని ||

2. దుఃఖముతో నిండియుండెన్ – ప్రక్కలోన గ్రుచ్చబడెను
రక్తితోడయోర్చుకొని వి – రక్తి మాట పల్కకుండెన్
|| యేసుని ||

3. శోకంబు చెత నేను – నాకంబు కదిలింతును
రక్తంబుధార పోసెన్ – రిక్తులమైన మనకు
|| యేసుని ||

4. సదయుని రక్తముచే – హృదయాలంకారముచే
కలుగు నాహారమిదియే – ఎల్లరకు శ్రేష్టాహారం
|| యేసుని ||

5. తల్లి ప్రేమకన్న మిగుల – తన ప్రేమ చూపె మనపై
నోటి మాటతోడ శత్రున్ – కోటల నశింపజేసెన్
|| యేసుని ||

6. నా యేసు రక్తచెమట – నాయప్పు యంతయున్ తీర్చెన్
ఎల్లరికి నంగీకారమిదే – ఎల్లప్పుడు నా ధ్యానమున్
|| యేసుని ||

7. హల్లెలూయా గీతమును – ఎల్లప్పుడు చాటుచుందున్
ఎల్లరియందు తానే – ఎల్లప్పుడు వసించున్
|| యేసుని ||

Leave a Comment