Jeevapu maargajyotivi

Jeevapu maargajyotivi – siluva mosina Yesu
mahima poornudavu neeve – siluva mosina Yesu

1. Shareera dhaarivaitivi – nee premanu kanuparachitivi
deenulanuddharinchitivi – siluva mosina Yesu“Jeevapu”

2. Neeve maarga satyamani – neeku peru kaligenu – nitya
jeevapu daatavu – punaruddhanudavu neeve“Jeevapu”

3. Arpanachesitivi baligaa – siluvapai nee praanamunu
kadigitivi nee rakhtamutho – siluva mosina Yesu “Jeevapu”

4. Nee dwaramuna jeritimi – neechulamu ayogyulamu – neeke
mahima stuti ghanata – siluva mosina Yesu “Jeevapu”

5. Calvary maarga yaatrikulam – neeke jayamani
paadedamu sarvada ninu stutiyinchedamu – siluva mosina Yesu “Jeevapu”

జీవపు మార్గ జ్యోతివి – సిలువ మోసిన యేసు
మహిమ పూర్ణుడగు నీవే – సిలువ మోసిన యేసు
1. శరీరధారివైతివి – నీ ప్రేమను కనుపరచితివి
దీనుల నుద్ధరించితివి – సిలువ మోసిన యేసు
|| జీవపు ||

2. నీవే మార్గ సత్యమని – నీకు పేరు కలిగెను
నిత్యజీవపు దాతవు – పునరుత్థానుడవు నీవే
|| జీవపు ||

3. అర్పణ చేసితివి బలిగా – సిలువపై నీ ప్రాణమును
కడిగితివి నీ రక్తముతో – సిలువ మోసిన యేసు
|| జీవపు ||

4. నీ ద్వారమున జేరితిమి – నీచులము అయోగ్యులము
నీకే మహిమ స్తుతి ఘనత – సిలువ మోసిన యేసు
|| జీవపు ||

5. కల్వరి మార్గ యాత్రికులం – నీకే జయమని పాడెదము
సర్వద నిను స్తుతియించెదము – సిలువ మోసిన యేసు
|| జీవపు ||

Leave a Comment