Kristu leche Halleluya – leche jayasheeludu
stotramaina Halleluya – kristu malli lechenu
choochi malli thana kaanthi – hrudul naayanan
chintha veedi santasaana vangi kristu neduta
Pallavi : Kristu leche Halleluya – leche jayasheeludu
stotramaina – Halleluya ! – kristu malli lechenu
2. Kristu leche mandalapu – chinta yantha theerenu
harsha dwaara moppa deesi – malli jeeva mondenu chaavu
narakaalu mrokki – dootalella galvanu – kotlu chuttu
kaanthi gooda – leche nipdu shoorudu “Kristu”
3. Kristu leche naati vantha – yantha yantha mondenu needu
goppa harshamaaye – kristu lechi nandunan shudda bhoo
samaadhi tholi – pantanu galginchenu vintagan
sajeevudaaye – boyi malli kanpaden “Kristu”
4. Kristu leche ! ninka chaavu ! narakaala bhayamu
lene ledu ! kristu nandu nanni gelchinaaramu
maa bhayaadulanni poyi – shanka digulumbaape
nedu punaruddaanapu – deevenala nondudamu“Kristu”
క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు!
స్తోత్రమైన హల్లెలూయ! క్రీస్తు మళ్ళీ లేచెను
చూచి మళ్ళీ తనకాంతి – హృదుల్ నాయనన్
చింతవీడి సంతసాన వంగి క్రీస్తునెదుట
పల్లవి : క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు!
స్తోత్రమైన హల్లెలూయ! క్రీస్తు మళ్ళీ లేచెను
1. క్రీస్తులేచె! మండలపు – చింతయంత తీరెను!
హర్ష ద్వార మొప్పదీసి – మళ్ళీ జీవ మొందెను
చావు నరకాలు మ్రొక్కి – దూతలెల్ల గల్వను
కోట్లు చుట్టు కాంతి గూడ – లేచెనిప్డు శూరుడు
|| క్రీస్తులేచె ||
2. క్రీస్తులేచె! నాటి వంత – యంత యంత మొందెను
నేడు గొప్ప హర్షమాయె – క్రీస్తు లేచినందునన్
శుద్ధ భూసమాధి తొలి – పంటను గల్గించెను
వింతగన్ సజీవుడాయె – బోయిమళ్ళి కన్పడెన్
|| క్రీస్తులేచె ||
3. క్రీస్తులేచె! నింక చావు! నరకాల భయము
లేనె లేదు! క్రీస్తు నందు నన్ని గెల్చినారము
మా భయాదులన్ని పోయి – శంకదిగులుంబాసె
నేడు పునరుత్థానంపు – దీవెనల నొందుదము
|| క్రీస్తులేచె ||