Raajaadhi raajaa raave – raaju yesu raajyamela raave
vairaajulaku raajuvai raave – ravikoti teja yesu raave
O……. megha vaahanambu meeda vegame
O……. minchu vaibavambuthoda vegame
1. O……. Bhujanmbulella theri choodagaa
O……. nee janambu swagathambu neeyagaa
nee raajya sthaapanambu cheya –
bhuraajulella goolipova
bhoomiyakashambu maaripova –
nee mahaaprabavamuna vega “Raja”
2. aa… akasamuna dootalaarbhaatimpagaa
aa… aadi baktha sangha samethambugaa
aakaasambu madhya veedhilona – “Raja”
ekamai mahasabacheya
yesunaadha! needu mahimalona –
makade mahaanandamouga “Raja”
3. O……. parama yerusalemu punya sangamaa !
O……. gorrepilla kristhu punya sangamaa !
parama dootalaaraa ! bhakthulaaraa ! paulapostulaaraa !
peddalara ! goriyapilla yesuraju pera –
krotha geethametthi paadaraaraa “Raja”
రాజాధిరాజా రావే – రాజు యేసు రాజ్యమేల రావే
రాజులకు రాజువై రావే – రవికోటి తేజ యేసు రావే
ఓ … మేఘ వాహనంబు మీద వేగమే
ఓ … మించు వైభవంబుతోడ వేగమే
1. ఓ … భూజనంబులెల్ల తేరి చూడగా
ఓ … నీ జనంబు స్వాగతంబు నీయగా
నీ రాజ్య స్థాపనంబు చేయ – భూరాజులెల్ల గూలిపోవ
భూమియాకాశంబు మారిపోవ – నీ మహాప్రభావమున వేగ
|| రాజాధిరాజా ||
2. ఆ … ఆకసమున దూతలార్భటింపగా
ఆ … ఆది భక్త సంఘ సమేతంబుగా
ఆకసంబు మధ్య వీధిలోన – ఏకమై మహాసభచేయ
యేసునాథ! నీదు మహిమలోన – మాకదే మహానందమౌగ
|| రాజాధిరాజా ||
3. ఓ … పరమ యెరూషలేము పుణ్యసంఘమా !
ఓ … గొఱ్ఱెపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా !
పరమదూతలారా ! భక్తులారా ! పౌలపొస్తులారా !
పెద్దలారా ! గొఱియపిల్ల యేసురాజు పేర – క్రొత్త గీతమెత్తి పాడరారా
|| రాజాధిరాజా ||