Meghamumeeda Yesuraju

Meghamumeeda Yesuraju vega milaku vachchun

A. P. : Sidhamuga nunduvarala jerchunu sheegramugaa digunu

1. Prabhuvu thaane aarbhaatamutho ee bhuviki vachchun
ikkada nammina vaaralu eguruchu ee bhuvi vidachedaru
“Megha”

2. Kristu nandu mrutulagu vaaru lechi velluduru
nilichiyundu parishuddulandaru maayamai poyedaru
“Megha”

3. Vela velagu aayana maatalu raakanu delpenu
pravaktalapostululu daanini gurchiye prakatinchiri
“Megha”

4. Paatlupadedu vaarala kesu prathiphalamichunu cheru
manaku sampoorna shakhtini cheluvuga nosagunu
“Megha”

5. ayana telpina gurtulanniyu neraveruchunnavi raakada
gadiya nevaru yerugaru thandrike theliyunu “Megha”

6. Veyi yendlu yesu ilalo raajyamu yelunu
neethi samaadhanamu lundu nayana rajyamulo “Megha”

7. Halleluya geetamu paadi aarbhaatinchedamu
vallabudidigo vachhedu vela sameepamayenu“Megha”

మేఘము మీద యేసురాజు వేగ మిలకువచ్చున్

అనుపల్లవి : సిద్ధముగ నుండువారల జేర్చును శీఘ్రముగా దిగును

1. ప్రభువు తానే ఆర్భాటముతో ఈ భువికి వచ్చున్
ఇక్కడ నమ్మినవారలు ఎగురుచు ఈ భువి విడచెదరు
|| మేఘము ||

2. క్రీస్తునందు మృతులగు వారు లేచి వెళ్ళుదురు
నిలిచియుండు పరిశుద్ధులందరు మాయమై పోయెదరు
|| మేఘము ||

3. వేల వేలగు ఆయన మాటలు రాకను దెల్పెను
ప్రవక్తలపొస్తలులు దానిని గూర్చియే ప్రకటించిరి
|| మేఘము ||

4. పాట్లుపడెడు వారల కేసు ప్రతిఫలమిచ్చును
చేరు మనకు సంపూర్ణశక్తిని చెలువుగ నొసగును
|| మేఘము ||

5. ఆయన తెల్పిన గురుతులన్నియు నెరవేరుచున్నవి
రాకడ గడియ నెవరు యెరుగరు తండ్రికే తెలియును
|| మేఘము ||

6. వేయి యేండ్లు యేసు యిలలో రాజ్యము యేలును
నీతి సమాధానములుండు నాయన రాజ్యములో
|| మేఘము ||

7. హల్లెలూయా గీతముపాడి ఆర్భాటించెదము
వల్లభుడిదిగో వచ్చెడు వేళ సమీపమాయెను
|| మేఘము ||

Leave a Comment