Sodarulaaraa lendi

Sodarulaaraa lendi raakada gurtulu choodandi !
diviteela noonetho nimpi – siddapadandi

1. Ardaraatri velalo – prabhu raakada dwani mrogenu –
somaritanamu vidachi – (2 times)
nadumuna dhatti ghatti-prabhuni keduruchoodumu “Sodaru”

2. Sarvatra yuddaalu bhookampamulunu ghoravyaadhulu
ghooramuga prabalenu – (2 times)
yesuni raakada sameepam – bayeno sodaraa “Sodaru”

3. Raajyaalu adhikaraalanni – kadalipovuchunnavi –
kalavara madhikambaye – (2 times)
kannulu terachi chooduma prabhu vachchu vellaaye “Sodaru”

4. Chedarina yoodulu swadesaaniki cherute yoka soochana
kristuyuga marambamu – (2 times)
raanai yunna velide – kanipettumu sodaraa “Sodaru”

5. Talupu veyabadina Iona – pravesinchaneravu –
pashchaataapa padumu (2 times)
yesupai naadaarapadi samsiddapadumaa “Sodaru”

సోదరులారా లెండి – రాకడ గుర్తులు చూడండి
దివిటీల నూనెతో నింపి – సిద్ధపడండి

1. అర్ధరాత్రివేళలో – ప్రభురాకడ ధ్వని మ్రోగెను
సోమరితనము విడచి (2)
నడుమున దట్టి గట్టి – ప్రభుని కెదురుచూడుము
|| సోదరులారా ||

2.సర్వత్రయుద్ధాలు భూకం-పములును ఘోరవ్యాధులు
ఘోరముగ ప్రబలెను (2)
యేసుని రాకడ సమీపం – బాయెనో సోదరా
|| సోదరులారా ||

3. రాజ్యాలు అధికారాలన్ని – కదలిపోవుచున్నవి
కలవర మధికంబాయె (2)
కన్నులు తెరచి చూడుమా ప్రభు వచ్చేవేళాయె
|| సోదరులారా ||

4. చెదరిన యూదులు స్వదేశానికి చేరుటే యొక సూచన
క్రీస్తుయుగ మారంభము (2)
రానై యున్న వేళిదే – కనిపెట్టుము సోదరా
|| సోదరులారా ||

5. తలుపు వేయబడిన లోన – ప్రవేశించనేరవు
పశ్చాత్తాప పడుము (2)
యేసుపై నాధారపడి సంసిద్ధపడుమా
|| సోదరులారా ||

Leave a Comment