Nee devuni sandhincha neevu aayathamaa ?
1. Bhuviki yesu vachunappudu dustulanigedaru
aavidhamuna neevundina emichetuvu ? “Nee Devuni”
2. Meghamutho vaththunani cheppinavaadu
meghamupai vachukaalamu sameepinchenu “Nee Devuni”
3. Doota ganamulatho booradwanitho
aa bhakhtaganamula galiyu kaalamaayenu “Nee Devuni”
4. Bhakti heenulella napudu angalaarturu
rakshananu pondaleru vaara lappudu “Nee Devuni”
5. Paapa jeevulella naadu daagukonduru
shuddha paracha badinavaaru egiripoduru “Nee Devuni”
6. Krupa kaalamande pashchthaapa mondumu
Ippude angeekarinchi mannimpu nondu “Nee Devuni”
7. Neekai mruthi bondi yesu kaachi yunaadu
ninnu angeekarinchunu karunathodanu “Nee Devuni”
8. Devuni angeerakinchani vaaru aa naadu
daagu koni niratamu parithapinthuru “Nee Devuni”
నీ దేవుని సంధించ నీవు ఆయత్తమా
1. భువికి యేసు వచ్చునప్పుడు దుష్టులణిగెదరు
ఆ విధమున నీవుండిన ఏమి చేతువు?
|| నీ దేవుని ||
2. మేఘముతో వత్తునని చెప్పినవాడు
మేఘముపై వచ్చుకాలము సమీపించెను
|| నీ దేవుని ||
3. దూత గణములతో బూరధ్వనితో
ఆ భక్తగణముల గలియు కాలమాయెను
|| నీ దేవుని ||
4. భక్తి హీనులెల్ల నపుడు అంగలార్తురు
రక్షణను పొందలేరు వారలప్పుడు
|| నీ దేవుని ||
5. పాప జీవులెల్ల నాడు దాగుకొందురు
శుద్ధ పరచబడినవారు ఎగిరిపోదురు
|| నీ దేవుని ||
6. కృపకాలమందే పశ్చాత్తాప మొందుము
ఇప్పుడే అంగీకరించి మన్నింపు నొందు
|| నీ దేవుని ||
7. నీకై మృతి బొంది యేసు కాచియున్నాడు
నిన్ను అంగీకరించును కరుణతోడను
|| నీ దేవుని ||
8. దేవుని అంగీకరించని వారు ఆ నాడు
దాగుకొని నిరతము పరితపింతురు
|| నీ దేవుని ||