Yesu sheeghramuga thirigi vachchun – satya
devuni vaakyamide – aayana raakada antya
gurtulu – anniyu neraveru chunnavi – yesu
sheegramuga thirigi vachchun
1. Paapa dukhamulu perugu chunnavi – yuddakalahamulu
vruddiyaayenu – janamupai janamu lechuchunnadi
raajyamupai raajyamu lechu chunnadi “Yesu”
2. Bhookampamulu bhuvini jaruguchande – lokamuna
thegulu karuvu lunnavi – aakasamuna bhayasoochanaluveekshinturu
vintha soochanalu “Yesu”
3. Viswaasulu paiki ethabadan – Yesu paramunundi
digivachchunu – Yesutho veyyendlu eledaru –
aashatho kanipettukonuvaaralu “Yesu”
4. Maaru manassu nondu meekshaname –
koru Yesu rakhtaana kadugumani – ee rojuna
neevu siddapadumu – paralokamuna
Praveshintuvu “Yesu”
యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ – సత్యదేవుని వాక్యమిదే
ఆయన రాకడ అంత్య గుర్తులు – అన్నియు నెరవేరుచున్నవి
యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్
1. పాపదుఃఖములు పెరుగుచున్నవి – యుద్దకలహములు వృద్ధియాయెను
జనముపై జనము లేచుచున్నది – రాజ్యముపై రాజ్యము లేచుచున్నది
|| యేసు ||
2. భూకంపములు భువిని జరుగుచుండె – లోకమున తెగులు కరువు లున్నవి
ఆకసమున భయసూచనలు – వీక్షింతురు వింత సూచనలు
|| యేసు ||
3. విశ్వాసులు పైకి ఎత్తబడన్ – యేసు పరమునుండి దిగివచ్చును
యేసునితో వెయ్యేండ్లు ఏలెదురు – ఆశతో కనిపెట్టుకొనువారలు
|| యేసు ||
4. మారుమనస్సు నొందుమీ క్షణమే – కోరు యేసు రక్తాన కడుగుమని
ఈ రోజున నీవు సిద్ధపడుము – పరలోకమున ప్రవేశింతువు
|| యేసు ||