Kaalamu sameepamu prabhu yesu
vachchun jeetamu pondunu nija
daasudu aananda mondedaru
aananda mondedaru
1. Bayalu padu prati vaani kriyalu karragaddi
koyya kaalainanu vendi bangaaramu
viluva raallainanu – agni ye thelupunu – ‘2’
appude kanugonduvu “Kaalamu”
2. Pande mandu neeku paalunna daa
pondu vaadokkade bahumathini –
yodhudavai manchi buddhini kaligina
vaada baarani ‘2’ kireeta mondedavu “Kaalamu”
3. Aatmala korakai bhaara munnadaa
phalitha munnadaa nee sevalo – prabhuni
raakalo andari yeduta aananda mahima – 2
kireeta mondedavu “Kaalamu”
4. Sanghamu nadipe sevakudaa mandanu
nadupumu prema thoda – aadarshundavai
mandanu kaachina mahima kireetam – ‘2’
neevu pondedavu “Kaalamu”
5. Manchi poratamu poraadumu – kaapaadu –
konu vishwaasamunu – thana pratyakshata
napekshinchumu neethi kireetamu – ‘2’
nee kivva badunu “Kaalamu”
6. Bhakhtitho brathuka gorinacho siddapadu
ponda himsalanu anthamu varaku
nammika yunchina jeeva kireetamu – ‘2’
pondeda verugu “Kaalamu”
7. Daya cheyu shresta deevenalu angeeka –
rinchu nee praardhanalu – praardhana
yandu melconi yundumu swarna kireetamu – ‘2’
dharimpa jeyunu “Kaalamu”
కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్
జీతము పొందును నిజ దాసుడు
ఆనందమొందెదరు ఆనందమొందెదరు
1. బయలుపడు ప్రతివాని క్రియలు – కర్రగడ్డి కొయ్యకాలైనను
వెండి బంగారము విలువ రాళ్ళైనను
అగ్నియే తెల్పును – (2) అప్పుడే కనుగొందువు
|| కాలము ||
2. పందెమందు నీకు పాలున్నదా – పొందువాడొక్కడే బహుమతిని
యోధుడవై మంచి బుద్ధిని కలిగిన
వాడబారని – (2) కిరీట మొందెదవు
|| కాలము ||
3. ఆత్మలకొరకై భారమున్నదా – ఫలితమున్నదా నీ సేవలో
ప్రభుని రాకలో అందరి యెదుట
ఆనందమహిమ – (2) కిరీట మొందెదవు
|| కాలము ||
4. సంఘము నడిపే సేవకుడా – మందను నడుపుము ప్రేమతోడ
ఆదర్శుండవై మందను కాచిన
మహిమ కిరీటము – (2) నీవు పొందెదవు
|| కాలము ||
5. మంచి పోరాటము పోరాడుము – కాపాడుకొను విశ్వాసమును
తన ప్రత్యక్షత నపేక్షించుము
నీతి కిరీటము – (2) నీ కివ్వబడును
|| కాలము ||
6. భక్తితో బ్రతుక గోరినచో – సిద్ధపడు పొంద హింసలను
అంతము వరకు నమ్మికయుంచిన
జీవకిరీటము – (2) పొందెద వెరుచు
|| కాలము ||
7. దయచేయు శ్రేష్ఠ దీవెనలు – అంగీకరించు నీ ప్రార్థనలు
ప్రార్థన యందు మేల్కొని యుండుము
స్వర్ణకిరీటము – (2) ధరింపజేయును
|| కాలము ||