Prakaasha vastramutho paraloka mahimatho
lokambuna ketenchunu meghambupai prabhuve
1. Antya soochanalu choodumu – prabhu raakaku munupu
kristu nishchayamugaa vachunu – boora shabdhamutho
vistarinchu lokamandu – yuddhamu karuvulu
vistarinchu paapamulu dukkhamu kalavaramu“Prakaa”
2. Paapamuche janminchiri – thalli garbhamu nundi
kopamu dustamosamu – ellari hrudayamulu
paapa drusti jaarachora devadooshana hatyalu
vepugaa dusta garvamul – hrudaya rogamulu “Prakaa”
3. Vellaru paralokamunaku – evvaru paapamutho
chaalavu neeti kriyalu – praardhanalu rakshimpavu
chaalunu yesu rakshimpa – praana marpinchenu
kalushamulu kaduganu – thana rakhtamu chindinche“Prakaa”
4. Kshanamulone gatinchunu – jeevitha mepaatidi thana
yaasthi vidachi narudu – narakamu paalagun ninnu
rakshimpa nee prabhu – siddhamuga niliche pennuga
pondumu rakshana – nammi yesu prabhuvulo “Prakaa”
ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో
లోకంబున కేతెంచును మేఘంబుపై ప్రభువే
1. అంత్య సూచనలు చూడుము – ప్రభు రాకకు మునుపు
క్రీస్తు నిశ్చయముగా వచ్చును – బూర శబ్దముతో
విస్తరించు లోకమందు – యుద్ధము కరవులు
విస్తరించు పాపములు దుఃఖము కలవరము
|| ప్రకాశ ||
2. పాపముచే జన్మించిరి – తల్లి గర్భమునుండి
కోపము దుష్టమోసము – ఎల్లరి హృదయములు
పాప దృష్టి జారచోర – దేవదూషణ హత్యలు
వేపుగా దుష్టగర్వముల్ – హృదయ రోగములు
|| ప్రకాశ ||
3. వెళ్ళరు పరలోకమునకు – ఎవ్వరు పాపముతో
చాలవు నీతి క్రియలు – ప్రార్థనలు రక్షింపవు
చాలును యేసు రక్షింప – ప్రాణమర్పించెను
కలుషములు కడుగును – తన రక్తము చిందించె
|| ప్రకాశ ||
4. క్షణములోనే గతించును – జీవిత మేపాటిది
తన యాస్తి విడచి నరుడు – నరకము పాలగున్
నిన్ను రక్షింప నీ ప్రభు – సిద్ధముగ నిలచె
పెన్నుగ పొందుము రక్షణ – నమ్మి యేసు ప్రభువులో
|| ప్రకాశ ||