Papamunaku jeetamu maranamu O papi bhayapadavaa ?
chuchunadella nasinchu nishchayamu – chudanide nityamu
Pallavi : Yesurajuvachunu inka kontakaalame –
mokshamandu cherudumu
2. Lokasukhamu nammaku nammaku – aa ichchalu maayamagu
nee jeevamu povu samayamuna-chilligawa venttaraadu “Yesu”
3. Nee kaalamella vyaradamaguchunnadi – lokamayalayanduna
daivakopamu vachutaku munddu – nee rakshkuni cherumu “Yesu”
4. Daiva prema paruchunnadi – kalvarigiri meedanundi
nee papamella andupovunu – snanambu chesinan “Yesu”
5. Maha papinaina nannunu naa mitrudangikarinchen
O paapi neevu parugidiraa – deva deevenala pondumu “Yesu”
6. Kashtadukkamu lekkuvagucho – Istudesuni veedanu
sigguleka cherudu nayanachentha-neppudu vasintunu “Yesu”
పాపము వలన వచ్చు జీతము మరణము” రోమా Romans 6:23
పాపమునకు జీతము మరణము (3) ఓ పాపి భయపడవా?
చూచునదెల్ల నశించు నిశ్చయము (3) చూడనిదే నిత్యము
పల్లవి : యేసురాజు వచ్చును ఇంక కొంతకాలమే – మోక్షమందు చేరుదుము
1. లోకసుఖము నమ్మకు నమ్మకు (3) ఆ యిచ్ఛలు మాయమగు
నీ జీవముపోవు సమయమున (3) చిల్లిగవ్వ వెంటరాదు
|| యేసురాజు ||
2. నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది (3) లోకమాయలయందున
దైవకోపము వచ్చుటకు ముందు (3) నీ రక్షకుని చేరుము
|| యేసురాజు ||
3. దైవ ప్రేమ పారుచున్నది (3) కల్వరిగిరి మీదనుండి
నీ పాపమెల్ల అందుపోవును (3) స్నానంబుచేసినన్
|| యేసురాజు ||
4. మహా పాపినైన నన్నును (3) నా మిత్రుడంగీకరించెన్
ఓ పాపి నీవు పరుగిడి రా (3) దేవ దీవెనల పొందుము
|| యేసురాజు ||
5. కష్టదుఃఖము లెక్కువగుచో (3) ఇష్టుడేసుని వీడను
సిగ్గులేక చేరుదు నాయనచెంత (3) నెప్పుడు వసింతును
|| యేసురాజు ||