Hosanna New Song 2026 – Karuna Katakshamu – కరుణాకటాక్షము

పల్లవి: కరుణా కటాక్షము గల యేసయ్యా
నను విస్తరింపజేయు మహనీయుడా దివ్య సుందరమా
దయకు నిలయమా దివిలో కాంతి తేజమా పరిమళ నామమా
ప్రేమకు నిలయమా పరిశుద్ధ స్తుతి గానమా

చరణం 1: ఏమున్నదని నాపై లక్ష్యముంచినావు
ఆదరించి ప్రేమించి కటాక్షించినావు
నీ రెక్కల నీడే సురక్షితం
నీ పాద సన్నిధే క్షేమము
కృప వెంబడి కృపను
నిత్యమైన ప్రేమను అధికమైన మహిమను విస్తరింపజేశావు

చరణం 2: నేనెంతటి వాడనని ఇంతగా హెచ్చించావు
ఏలుటకు ఎన్నుకొని అభిషేకించావు
నీ ఇష్టునిగా నివసించెదను నీ ఉద్దేశము నే మరువను
కృప వెంబడి కృపను నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేశావు

చరణం 3: ఏ యోగ్యత లేని నాకు తోడుగా నిలిచావు
నింద అవమానములో ఘనతనిచ్చినావు నీ నడిపింపుకు లోబడితిని
నీ స్వాస్థ్యమునకై వేచియుంటిని
కృప వెంబడి కృపను నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేశావు


Recent Songs

Leave a Comment