Adigo vachinadevaro chudumu

Adigo vachinadevaro chudumu –
mahima galigina mana Yese
nee kannuleththi chudu maa –
kristhu prabavamutho vachuchunden

1. Meghaarududai vachuchunnadu – kampinchenu aakaashamella veene vaayimpa doothal paadanga pendli kumaarundai vachuchunden “Adhigo”

2. Surya chandrulu adrushulairi – mrutulevaruleru achata
andaru bayapadi vanukuchunnaaru – teerpu cheya kristu vachuchunda “Adhigo”

3. Gathinchunu manamunna lokamu –
nootana loka mokati kalugunu
nootana magunu jagamantayunu – kristu raajyamela – vachuchunden “Adhigo”

4. Mundla makutamu ninkaledu –
mahima kiritamu darinchenu
alankaramuto andamaiyunna –
pendli kumarthekai vachuchunden “Adhigo”

అదిగో వచ్చునదెవరో చూడుమా – మహిమ గలిగిన మన యేసే
నీ కన్నులెత్తి చూడుమా – క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్

1. మేఘారూఢుడై వచ్చుచున్నాడు – కంపించెను ఆకాశమెల్ల
వీణె వాయింప దూతల్ పాడంగ – పెండ్లి కుమారుండై వచ్చుచుండెన్
|| అదిగో ||

2. సూర్యచంద్రులు అదృశ్యులైరి – మృతులెవ్వరులేరు అచ్చట
అందరు భయపడి వణకుచున్నారు – తీర్పుచేయ క్రీస్తు వచ్చుచుండెన్
|| అదిగో ||

3. గతించును మనమున్న లోకము – నూతన లోక మొకటి కలుగును
నూతన మగును జగమంతయును – క్రీస్తు రాజ్యమేల వచ్చుచుండెన్
|| అదిగో ||

4. ముండ్ల మకుటము నింకలేదు – మహిమ కిరీటము ధరించెను
అలంకారముతో అందమైయున్న – పెండ్లి కుమార్తెకై వచ్చుచుండెన్
|| అదిగో ||

Leave a Comment