సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి

Suryuni Dharinchi | సూర్యుని ధరించి

సూర్యుని ధరించి 
చంద్రుని మీద నిలిచి 
ఆకాశములో కనుపించె ఈమె ఎవరు ? 

ఆత్మల భారం - ఆత్మాభిషేకం 
ఆత్మ వరములు - కలిగియున్న 
మహిమ గలిగిన - సంఘమే                         || సూర్యుని||

జయ జీవితము - ప్రసవించుటకై 
వేదన పడుచు - సాక్షియైయున్న 
కృపలో నిలిచిన - సంఘమే                         || సూర్యుని ||

ఆది అపోస్తలుల - ఉపదేశమునే 
మకుటముగా - ధరించియున్న 
క్రొత్త నిబంధన - సంఘమే                            || సూర్యుని ||

నా జీవితం – నీకంకితం

నా జీవితం – నీకంకితం

కడవరకు సాక్షిగా – నన్ను నిలుపుమా – ప్రభూ

1. బీడుబారినా – నా జీవితం

నీ సిలువ జీవ ఊటలు – నన్ను చిగురింపజేసెనే ॥ నా జేవితం ॥

2. పచ్చని ఒలీవనై – నీ మందిరావరణములో

నీ తోనే ఫలించెదా – బ్రతుకు దినములన్నిట ॥ నా జేవితం ॥

సీయోనులో – నా యేసుతో

సీయోనులో – నా యేసుతో

సింహాసనం యెదుట – క్రొత్తపాట పాడెద

ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు

1. సీయోను మూల రాయిగా – నా యేసు నిలిచి యుండగా

ఆత్మసంబంధమైన మందిరముగా

కట్టబడుచున్నాను – యేసుపై ॥ సీయోను ॥

2. సీయోను కట్టి మహిమతో – నా యేసు రానై యుండగా

పరిపూర్ణమైన పరిశుద్ధతతో

అతి త్వరలో ఎదుర్కొందును – నా యేసుని ॥ సీయోను ॥

యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులం

యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులం
యూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలం
క్రీస్తు వారలం – పరలోక వాసులం
వధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులం
ముందుకే సాగెదం – వెనుక తట్టు తిరుగము
ఈ లోకములో ఉప్పు శిలగ మిగలము
మెలకువగా ఉండెదం – ప్రభుని ప్రార్ధించెదం
పరలోకముకై మేము సిద్ధపడెదము
జయము జయము హోసన్నా జయము జయమని
నోరారా రారాజును కీర్తించెదం
జయము జయము హోసన్నా జయము జయమని
మనసారా మహా రాజును సేవించెదం        ||యుద్ధ||

గర్జించే అపవాది ఎదురు నిలచినా
ఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినా
శోధనలు శత్రువులా చుట్టు ముట్టినా
పాపములో మమ్మును పడద్రోయ జూచినా
విశ్వాసమే ఆయుధం – ప్రార్ధనే మా బలం
వాక్యమనే ఖడ్గముతో తరిమి కొట్టెదం
సిలువలో సాతానుని – తలను చితక త్రొక్కిన
మా రాజు యేసులోనే జయము పొందెదం       ||జయము||

జయం జయం.. నోరారా రారాజును కీర్తించి
జయం జయం.. మనసారా మహా రాజును సేవించి
జయం జయం.. నోరారా రారాజును కీర్తించి
జయం జయం.. మనసారా మహా రాజును సేవించెదం

ఇహ లోక ఆశలెన్నో మోసగించినా
క్రీస్తు ప్రేమ నుండి విడదీయ జూచినా
శ్రమలు అవమానములే కృంగదీసినా
బలహీనతలే మమ్మును భంగ పరచినా
బ్రతుకుట ప్రభు కోసమే – చావైనా లాభమే
పందెమందు ఓపికతో పోరాడెదం
నిత్య జీవమివ్వను – మరణమును గెలిచిన
మహిమ రాజు క్రీస్తులోనే జయము పొందెదం       ||జయము||

ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం అనుభవించెద

ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం అనుభవించెద

ఆది అంతము లేనిది – నీ కృప శాశ్వతమైనది

1. ప్రేమతో పిలిచి నీతితో నింపి – రక్షించినది కృపయే -2

జయ జీవితమును చేసెదను – అమూల్యమైన కృపతో -2 ॥ ఆశ్చర్య ॥

2. ఆకాశము కంటె ఉన్నతమైనది – నీ దివ్యమైన కృపయే -2

పలు మార్గములలో స్థిరపరచినది – నవనూతన కృపయే -2 ॥ ఆశ్చర్య ॥

3. యేసయ్యా – నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను -2

నీ కృపను గూర్చి పాడెదను – ఆత్మానందముతో -2 ॥ ఆశ్చర్య ॥