సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి సాగిపోదును నా యేసయ్యతో ఆత్మీయ బలమును పొందుకొని లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా దేవుని శక్తిసంపన్నతతో ప్రాకారములను దాటెదను నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను|| సాగిపోదును || నూతనమైన మార్గములో తొట్రిల్లకుండ నడిపించును - నవ దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే|| సాగిపోదును || శ్రేష్ఠమైన బహుమానముకై సమర్పణ కలిగి జీవింతును - మరి దేవుని సన్నిధిప్రభావము నాపై ప్రసరించెను నిశ్చయముగా మరి శ్రేష్ఠమైన సీయోనులో నిలుపును
Telugu Christian Songs
Listen to the best Telugu Christian Songs including worship, gospel, and devotional music. Explore dedication songs, prayer songs, and inspirational Telugu lyrics.
విజయ గీతము మనసార నేను పాడెద
విజయ గీతము మనసార నేను పాడెద
నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)
పునరుత్తానుడ నీవే
నా ఆలాపన నీకే నా ఆరాధన (2) ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే
పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)
యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది
నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ|| ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి
నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)
యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము
నీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ|| నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2)
యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె
నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2) ||విజయ||
మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే
పల్లవి: మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే మహదానందమే తనతో జీవితం ఓ మనసా ఇది నీకు తెలుసా! 1. దివ్యమైన సంగతులెన్నో నీ ప్రియుడు వివరించగా ఉత్సాహ ధ్వనులతో వూరేగితివే ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా దిగులు చెందకే ఓ మనసా ౹౹మనసా౹౹ 2. ఆశ్చర్య కార్యములెన్నో నీ ప్రియుడు చేసియుండగా సంఘము ఎదుట నీవు సాక్షివైతివే ఇహలోక శ్రమలన్ని స్వల్పమేగా కలవరమేలనే ఓ మనసా ౹౹మనసా౹౹ 3. నిష్కళoకరాలవు నీవని నీ ప్రియుడు నిను మెచ్చెనే కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే దుష్టుల క్షేమము నీ కంట బడగా మత్సరపడకే ఓ మనసా ౹౹మనసా౹౹
నీ కృప నిత్యముండును
నీ కృప నిత్యముండును
నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము (2) ||నీ కృప||
శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2) ||నీ కృప||
ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2) ||నీ కృప||
అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2) ||నీ కృప||
సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై
పల్లవి: సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానై యుండగా త్వరగా రానై యుండగా సంపూర్ణ సిద్ధి నొంద స్థిరపడెదము సంఘసహవాసములో ప్రేమసామ్రాజ్యములో 1. వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను ఏర్పరచబడినవారే తొట్రిల్లుచున్న కాలమిదే వీరవిజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికే విధేయులమై నిలిచియుందుము || సీయోను || 2. అధైర్యపడకు వదంతులెన్నో విన్నాను ఆత్మభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే నిత్యమహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో నిరంతరము ఆనందించెదము || సీయోను || 3. ఆశ్చర్యపడకు ఆకాశశక్తులు కదలినను దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యె కాలమిదే ఆర్భాటముగా రారాజు యేసు దిగివచ్చే వేళ రూపంతరము మనము పొందెదము || సీయోను ||