నూతన యెరూషలేము | Nutana Yerusalemu

పల్లవి: నూతన యెరూషలేము పట్టణము
పెండ్లికై అలంకరింపబడుచున్నది (2)

1. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది (2)
వారాయనకు ప్రజలై యుందురు (2)
ఆనందం ఆనందం ఆనందమే (2)

|| నూతన ||

2. ఆదియు నేనె అంతము నేనై యున్నాను (2)
ధుఃఖము లేదు మరణము లేదు (2)
ఆనందం ఆనందం ఆనందమే (2)

|| నూతన ||

3. అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు (2)
ఎవరు దానిలో లేనే లేరు (2)
ఆనందం ఆనందం ఆనందమే (2)

|| నూతన ||

4. దేవుని దాసులు ఆయనను సేవించుదురు (2)
ముఖదర్శనము చేయుచు నుందురు (2)
ఆనందం ఆనందం ఆనందమే (2)

|| నూతన ||

5. సీయోనులో గొర్రె పిల్లయే మూలరాయి (2)
సీయోను పర్వతము మీదయు ఆయనే (2)
ఆనందం ఆనందం ఆనందమే (2)

|| నూతన ||

ఆనంద యాత్ర – హోసన్నా మినిస్ట్రీస్

ఆనంద యాత్ర
ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన
యెరుషలేము యాత్ర
మన.. యేసుతో నూతన
యెరుషలేము యాత్ర              ||ఆనంద యాత్ర||

యేసుని రక్తము
పాపములనుండి విడిపించెను (2)
వేయి నోళ్ళతో స్తుతించినను
తీర్చలేము ఆ ఋణమును (2)    ||ఆనంద యాత్ర||

రాత్రియు పగలును
పాదములకు రాయి తగలకుండా (2)
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవదూతలు మనకుండగా (2)     ||ఆనంద యాత్ర||

కృతజ్ఞత లేని వారు
వేలకొలదిగ కూలినను (2)
కృపా వాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర||

ఆనందం ఆనందం
యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై
ఆగమనాకాంక్షతో సాగెదం     ||ఆనంద యాత్ర||

నా స్తుతుల పైన నివసించువాడా

నా స్తుతుల పైన నివసించువాడా
నా అంతరంగికుడా యేసయ్యా (2)
నీవు నా పక్షమై యున్నావు గనుకే
జయమే జయమే ఎల్లవేళలా జయమే (2)

1. నన్ను నిర్మించిన రీతి తలచగా
ఎంతో ఆశ్చర్యమే
అది నా ఊహకే వింతైనది (2)
ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి
ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2)
||నా స్తుతుల||

2. ద్రాక్షావల్లి అయిన నీలోనే
బహుగా వేరు పారగా
నీతో మధురమైన ఫలములీయనా (2)
ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే
విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2)
||నా స్తుతుల||

3. నీతో యాత్ర చేయు మార్గములు
ఎంతో రమ్యమైనవి
అవి నాకెంతో ప్రియమైనవి (2)
నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి
పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2)
||నా స్తుతుల||

 


Naa Sthuthula Paina Nivasinchuvaadaa | Hosanna Ministries  Song Lyrical in English

Naa Sthuthula Paina Nivasinchuvaadaa
Naa Antharangikudaa Yesayyaa (2)
Neevu Naa Pakshamai Yunnaavu Ganuke
Jayame Jayame Ellavelalaa Jayame (2)

Nannu Nirminchina Reethi Thalachagaa
Entho Aascharyame
Adi Naa Oohake Vinthainadi (2)
Erupekkina Shathruvula Choopu Nundi Thappinchi
Enaleni Premanu Naapai Kuripinchaavu (2) ||Naa Sthuthula||

Draakshaavalli Aina Neelone
Bahugaa Veru Paaragaa
Neetho Madhuramaina Phalamuleeyanaa (2)
Unnatha Sthalamulapai Naaku Sthaanamichchithive
Vijayudaa Nee Krupa Chaalunu Naa Jeevithaana (2) ||Naa Sthuthula||

Neetho Yaathra Cheyu Maargamulu
Entho Ramyamainavi
Avi Naakentho Priyamainavi (2)
Nee Mahimanu Koniyaadu Parishuddhulatho Nilichi
Padi Thanthula Sithaaratho Ninne Keerthincheda (2) ||Naa Sthuthula||

సిలువలో వ్రేలాడే నీ కొరకే

సిలువలో వ్రేలాడే నీ కొరకే
సిలువలో వ్రేలాడే (2)
యేసు నిన్ను పిలచుచుండే
ఆలస్యము నీవు చేయకుము (2)

1. కల్వరి శ్రమాలన్నీ నీ కొరకే
ఘోర శిలువ మోసే కృంగుచునే
గాయములచే బాధ నొంది
రక్తము కార్చి హింస నొంది (2) ||సిలువలో||

2. నాలుక ఎండిను దప్పి గొని
కేకలు వేసెను దాహమని
చేదు రసమును పానము చేసి
చేసెను జీవ యాగమును (2) ||సిలువలో||

3. అగాధ సముద్ర జలములైన
ఈ ప్రేమను ఆర్ప జాలవు గా
ఈ ప్రేమ నీకై విలపించుచూ
ప్రాణము ధార బోయుచునే (2) ||సిలువలో||

 


Siluvalo Vreelaade Nee Korake .

Siluvalo vreelaade nee korake
Siluvalo vreelaade (2)
Yesu ninnu pilachuchunde
Aalasayamu neevu cheyakumu (2)

1. Kalvari shramalanni nee korake
Ghōra siluva mōse krunguchune
Gayamulache baadha nondi
Raktamu kaarchi himsa nondi (2)

Siluvalo vreelaade nee korake
Siluvalo vreelaade (2)
Yesu ninnu pilachuchunde
Aalasayamu neevu cheyakumu (2)

2. Naaluka endinu dappi goni
Kekalu vesenu daahamani
Chedhu rasamunu paanamu chesi
Chesenu jeeva yaagamunu (2)

Siluvalo vreelaade nee korake
Siluvalo vreelaade (2)
Yesu ninnu pilachuchunde
Aalasayamu neevu cheyakumu (2)

3. Agaadha samudra jalamulaina
Ee premanu aarpa jaalavuga
Ee prema neekai vilapinchuchu
Praanamu dhaara boyuchune (2)

Siluvalo vreelaade nee korake
Siluvalo vreelaade (2)
Yesu ninnu pilachuchunde
Aalasayamu neevu cheyakumu (2)

 

athyunatha-simhasanamu-pai

పల్లవి: అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే – ఆరాధింతుము నిన్నే
ఆహాహా … హల్లేలూయ (4X)
ఆహాహా … హల్లేలూయ (3X) …ఆమెన్

1. ఆశ్చర్యకరుడా స్తోత్రం – ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి – సమాధాన అధిపతి స్తోత్రం
…ఆహాహా…

2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం – కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే – నా రక్షణకర్తా స్తోత్రం
…ఆహాహా…

3. ఆమేన్ అనువాడా స్తోత్రం – ఆల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా – అత్యున్నతుడా స్తోత్రం
…ఆహాహా…

4. మ్రుత్యుంజయుడా స్తోత్రం – మహా ఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవా త్వరలో రానున్న – మేఘవాహనుడా స్తోత్రం
…ఆహాహా

For more info:

  1. Listen/Watch the Song:
    • [మీరు ఈ పాటను వినవచ్చు / యూట్యూబ్‌లో చూడండి]
  2. Related Bible Verses: