సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు

సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు (2)
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2)

1. నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే (2)
నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే (2)
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2)

2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే (2)
ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే (2)
నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2)

3. పునరుత్థానుడే జయశీలి మృతిని గెలిచి లేచినాడే (2)
శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే (2)
నాకై అతి త్వరలో మహిమతో రానైయున్నవాడే (2)

deva nee krupa nirantharam

దేవా! నీ కృప నిరంతరం – మారనిదెపుడు నా ప్రభువా
నిత్యజీవము గలది ప్రియ ప్రభువా …..
దేవా! నీ కృప నిరంతరం

1. పాపినగు నన్ను ఓ ప్రభువా – పరిశుద్ధపరచెను నీ కృపయే -2

పరమ స్వాస్థ్యము నొందుటకు – ప్రేమతో నన్ను పిలిచితివే -2 ॥ దేవా ॥

2. రక్షణ భాగ్యము పొందుటకు – రక్షక యేసు నీ కృపయే -2

నిత్యము నీతో నుండుటకు – నిత్య జీవము నిచ్చితివే -2 ॥ దేవా ॥

3. విశ్వాస జీవితం చేయుటకు – విజయము నిచ్చెను నీ కృపయే -2

శోధన బాధలు అన్నిటిలో – శక్తినొసంగి నడిపితివే -2 ॥ దేవా ॥

4. కృపలో నడుపుము ఓ దేవా – కృపతో నింపుము నా ప్రభువా -2

నిత్యము కృపలో నన్ను నడిపి – నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము -2 ॥ దేవా ॥