అనాదిలో నియమించబడిన

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల

ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల

గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల

1. వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె

మౌని యాయెను బలియాగమాయెను

తన రుధిరముతో నన్ను కొనెను

అదియే అనాది సంకల్పమాయెను

॥ అనాది ॥

2. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై

శరీరధారి యాయెను సజీవయాగమాయెను

మరణమును గెలిచి లేచెను

అదియే అనాది సంకల్పమాయెను

॥ అనాది ॥

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2)

వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా

నీ ప్రియమైన స్వాస్థ్యమును

రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను

నీ రాజ్య దండముతో         ||నీతి||

 

ప్రతి వాగ్ధానము నా కొరకేనని

ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2)

నిత్యమైన కృపతో నను బలపరచి

ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2)      ||నీతి||

 

పరిమళ వాసనగ నేనుండుటకు

పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు (2)

ప్రగతి పథములో నను నడిపించి

ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు (2)      ||నీతి||

 

నిత్య సీయోనులో నీతో నిలుచుటకు

నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు (2)

మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు

ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు (2)      ||నీతి||