Choodumade nee korake
siluvapai vrelaadu shree yesu rakshakun
1. Naluga gottabade neekai –
paluka kunde maarugaa shirassuna
rakhta dhaaralu virache rekkalanu
gruchcha nee paapame, paadamulanu
cheelchenu, ballemai prakkan bodiche “Choodu”
2. Rakhta siktamai momu – erranayye
koyyapai choodu veepuna dunnenu –
deenunigaa jese nee paapame prabhu
rakhtamu erulai – paarenu,
nee korake siluvapai “Choodu”
3. Gaayamaina chetulan dinamella
chaapeno paapi choochu chunde
prematho – neekai kanneetini
kaarchuchu thana krupatho, sandhinchunu
paapi ninu, cheruchentan nee kshaname “Choodu”
4. Entha kaala medpinchi – velupala
nunthu vathanini – theruvu hrudaya
dwaaramun – pondu maaru manassunu
eediname, nee paapamul kshamiyinchunu –
nee kitchu surakshananu “Choodu”
చూడుమదే నీ కొరకే
సిలువపై వ్రేలాడు శ్రీయేసు రక్షకున్
1. నలుగ గొట్టబడె నీకై – పలుకకుండె మారుగా
శిరస్సున రక్తధారలు విరచె రెక్కలను గ్రుచ్చ
నీ పాపమే, పాదములను – చీల్చెను, బల్లెమై ప్రక్కన్ బొడిచె
|| చూడుమదే ||
2. రక్తసిక్తమై మోము – ఎఱ్ఱనయ్యె కొయ్యపై
చూడు వీపున దున్నెను – దీనునిగా జేసె నీ పాపమే
ప్రభు రక్తము ఏరులై – పారెను, నీ కొరకే సిలువపై
|| చూడుమదే ||
3. గాయమైన చేతులన్ – దినమెల్ల చాపెనో పాపీ
చూచుచుండె ప్రేమతో – నీకై కన్నెటిని కార్చుచు
తన కృపతో, సంధించును – పాపి నిను, చేరుచెంతన్ నీక్షణమే
|| చూడుమదే ||
4. ఎంతకాల మేడ్పించి – వెలుపలనుంతు వతనిని
తెరువు హృదయ ద్వారమున్ – పొందు మారుమనస్సును
ఈ దినమే, నీ పాపముల్ క్షమియించును – నీకిచ్చు సురక్షణను
|| చూడుమదే ||