Deva gorrepilla siluvalo

Deva gorrepilla siluvalo samasinappudu
papa parihararda oota terachen
papi neevu a rakthamandu nilachiyunnavaa !
ipudu vidudalanu kori pondedava !

Pallavi : Rakthamandu Rakthamandu
papi neevu aa rakthamandu nilachi yunnavaa ?
Rakthamandu Rakthamandu –
ipudu vidudalanu kori pondedava !

2. Apavitrudainanu akramastudainanu
a pavitra raktamu shuddi cheyunu
elu papamainanu – atikramamainanu
elikache mannimpabadi yunnava ? “Raktha”

3. “Priyularaa” yanu prabhuni pilupu vintivaa ?
mayavesamantayu vidiyunnava ?
papa bandamu linka ninnu kattiyunnavaa ?
shaapalokamupai jaya monduchunnava ? “Raktha”

4. Athama jeeva shareerambula narpinchitiva ?
alpa visayamulonu satyamunnada ?
naadu maraninchina yesu lechi yunnadu
nedu yesun cherina yabhaya michchunu “Raktha”

5. Panchakhandamulanu rakshinchuta koraku
panchagaaya mondina prabhuni chudumaa
Inchukaina troyadu dasinatti varala
minchu satyamulanu kori vedakumu “Raktha”

6. Repu repu yanuta nammika kaaneradu –
maapu maraninchina nechati kegedavu?
prapakundagu yesuni chithamunu jaripina
sri paalundu ninnuthamundani mechchunu “Raktha”

7. Halleluya padumu sakthigala Yesuku –
kalla karyamulanu vidachiveyumu chella
chedaragunu kastamu lachotanu
Kollaga nanubavintunu sukhambunu “Raktha”

దేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడు
పాప పరిహారార్థ ఊట తెరచెన్
పాపి నీవు ఆరక్తమందు నిలచియున్నావా!
ఇపుడు విడుదలను కోరి పొందెదవా!

పల్లవి : రక్తమందు రక్తమందు
పాపి నీవు ఆ రక్తమందు నిలిచియున్నావా?
రక్తమందు రక్తమందు
ఇపుడు విడుదలను కోరి పొందెదవా?

1. అపవిత్రుడైనను అక్రమస్తుడైనను
ఆ పవిత్రరక్తము శుద్ధిచేయును
ఏలు పాపమైనను – అతిక్రమమైనను
ఏలికచే మన్నింపబడి యున్నావా?
|| రక్తమందు ||

2. “ప్రియులారా” యను ప్రభుని పిల్పు వింటివా?
మాయవేషమంతయు వీడియున్నావా?
పాప బంధము లింక నిన్ను కట్టియున్నవా?
శాపలోకముపై జయ మొందుచున్నావా?
|| రక్తమందు ||

3. ఆత్మజీవ శరీరంబుల నర్పించితివా?
అల్పవిషయములోను సత్యమున్నదా?
నాడు మరణించిన యేసులేచియున్నాడు
నేడుయేసున్ చేరిన యభయ మిచ్చును
|| రక్తమందు ||

4. పంచఖండములను రక్షించుట కొరకు
పంచగాయ మొందిన ప్రభుని చూడుమా
ఇంచుకైన త్రోయడు డాసినట్టి వారల
మించు సత్యములను కోరి వెదకుము
|| రక్తమందు ||

5. రేపు రేపు యనుట నమ్మిక కానేరదు
మాపు మరణించిన నెచటి కేగుదువు?
ప్రాపకుండగు యేసుని చిత్తమును జరిపిన
శ్రీ పాలుండు నిన్నుత్తముండని మెచ్చును
|| రక్తమందు ||

6. హల్లెలూయా పాడుము శక్తిగల యేసుకు
కల్ల కార్యములను విడచివేయుము
చెల్లచెదరగును కష్టము లచ్చోటను
కొల్లగా ననుభవింతువు సుఖంబును
|| రక్తమందు ||

Leave a Comment