Eyana mata vinudi

Eyana mata vinudi – needu – Eyane naa priya Kumarudu
“Eyana”

1. Eyane naa priya kumaarudu – shapamutirchedu paparahitudu
daivakumarundeeyane “Eyana”

2. Eyanamaata nirakarinchedivaaru –
tappinchukonaru daiva dandananu
dahinchabadudu rellappudu “Eyana”

3. Mahima gala raaju maata nichchenu – Ihamandayana
maatanu delpa
mahaasainyamu lechenu “Eyana”

4. Paraloka devuni darsanamunaku –
stirulai yundedamu maralaka manamu
videyulai vikasintumu “Eyana”

5. Dasuni swarupamunu dalchenu –
maranamu pondunantha vidheyudai
rikthuduga maraninchenu “Eyana”

6. Paramandunundu varilogani –
bhoomi yandunu – bhoomi krindaina
pujaneeyudeyane “Eyana”

7. Sarvasakthigala prabhuvanaku –
stotramu ghanata mahima prabhaavamu
nityamu kalgunugaka “Eyana”

ఈయన మాట వినుడి – నేడు – ఈయనే నా ప్రియ కుమారుడు

1. ఈయనే నా ప్రియ కుమారుడు – శాపముతీర్చెడు పాపరహితుడు
దైవకుమారుండీయనే
|| ఈయన ||

2. ఈయనమాట నిరాకరించెడివారు – తప్పించుకొనరు దైవదండనను
దహించబడుదు రెల్లప్పుడు
|| ఈయన ||

3. మహిమగల రాజు మాట నిచ్చెను – ఇహమందాయన మాటను దెల్ప
మహాసైన్యము లేచెను
|| ఈయన ||

4. పరలోక దేవుని దర్శనమునకు – స్థిరులై యుండెదము మరలక మనము
విధేయులై వికసింతుము
|| ఈయన ||

5. దాసుని స్వరూపమును దాల్చెను – మరణము పొందునంత విధేయుడై
రిక్తుడుగ మరణించెను
|| ఈయన ||

6. పరమందునుండు వారిలోగాని – భూమి యందును – భూమిక్రిందైన
పూజనీయుడీయనే
|| ఈయన ||

7. సర్వశక్తిగల ప్రభువునకు – స్తోత్రము ఘనత మహిమ ప్రభావము
నిత్యము కల్గును గాక
|| ఈయన ||

Leave a Comment