Geetam geetam jaya jaya geetam

Geetam geetam jaya jaya geetam
cheyi thatti paadedamu

A. P. : Yesu raaju lechenu Halleluya
jaya maarbhtinchedamu

1. Choodu samaadhini moosina raayi doralimpa –
badenu – andu vesina mudra, kaavali nilchenaa
daiva sutuni mundu “Geetam”

2. Valadu valadu eduva valadu velludi
galilayaku – thaanu cheppina vidhamuna thirigi
Lechenu – parugidi prakatinchudi “Geetam”

3. Anna, kayapa, vaarala sabhayu adaruchu
parugidiri – inka doota ganamula dwanini vinuchu
vanakuchu bhayapadiri “Geetam”

4. Gummamul therachi chakkaga naduvudi – Jaya
veerudu raaga mee mela thaala vaadyamul
boora lethi dwaninchudi “Geetam”

గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము

అనుపల్లవి : యేసు రాజు లేచెను హల్లెలూయ
జయమార్భటించెదము

1. చూడు సమాధిని మూసినరాయి – దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెనా
దైవసుతుని ముందు
|| గీతం గీతం ||

2. వలదు వలదు ఏడువ వలదు – వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి
|| గీతం గీతం ||

3. అన్న, కయప, వారల సభయు – అదరుచు పరుగిడిరి
ఇంక దూతగణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి
|| గీతం గీతం ||

4. గుమ్మలు తెరిచి చక్కగ నడువుడు – జయ వీరుడు రాగా
మీ మేళ తాళ వాద్యముల్ బూర
లెత్తి ధ్వనించుడి
|| గీతం గీతం ||

Leave a Comment