గౌరవింపజేయును | Gowravimpajeyunu

పల్లవి:
యేసుని రూపం నీలో తెలియును
క్రీస్తుని జీవం నిన్ను నిలుపును
నా ప్రాణమా నీకు కలతందుకే
నీ శ్రమను ప్రభు చూచుచుండెనే

​కోరస్:
గొప్ప జనముగా నిన్ను చేయు
ఘనమగు పేరు నీకిచ్చు
తగిన కాలమున శీఘ్రముగా
ఆయనే ఇది జరిగించును

​చరణం 1:
కొరగాని రాయన్న వారి ఎదుటనే
మూలకు తలరాయిగా నిన్ను చేయునే
సకల జాతులు నిన్ను కోరును
యేసుని మహిమతో నిండెదవు
ఈ వత్సరమే యేసు నీలో వెలువగును

​చరణం 2:
విరిగిన నీ బ్రతుకు బాగు చేయును
ఘనమగు దినములు నియమించును
పడిపోయిన చోటున నీదు తల ఎత్తును
రాజవిందులో నీకు స్థానమిచ్చును
ఈ వత్సరమే అధికముగా ఖ్యాతినిచ్చును

Leave a Comment