Jai jai Yishu Raja jai jai
Pallavi : Jai Jai yesu raajaa Jai Jai
Raajaadhi raaja neeke jai jai
1. Paapa koopamulo badiyunna
nannu joochi cheyi jaachi
chakkaga dariki jerchitivi “Jai Jai”
2. Siluva rakhtamulo nannu kadigi
paapa manthaa pariharinchina
paavanudagu naa prabhu yesu “Jai Jai”
3. Neeti heenuda naina naaku
neethi rakshana vastramulanu
preetitho nosagina neethi raajaa “Jai Jai”
4. manti purugu naina nannu
manti nundi minta jerchina
mahaa prabhundaa neeke Jai Jai “Jai Jai”
5. Paapa shaapa grastudonai yunda
nannu gooda nee swakeeya
saampadyamugaa jesitivi “Jai Jai”
6. Raajulaina yaajaka gumpulo
nannu gooda nee soththaina
parishuddha janamulo jerchitivi “Jai Jai”
7. Thalliyaina marachina marachunu
nenu ninnu maruva nanina
nammakamaina naa prabhuvaa “Jai Jai”
8. Adhika stotraarhuda vaina –
aadi antamu leni devaa
yugaa yugamulaku neeke Jai Jai “Jai Jai”
“కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన యెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.” నిర్గమకాండము Exodus 19:5
పల్లవి : జై జై యేసురాజా జై జై
రాజాధిరాజా నీకే జై జై
1. పాపకూపములో బడియున్న – నన్ను జూచి చేయి జాచి
చక్కగ దరికి జేర్చితివి
|| జై జై యేసురాజా ||
2. సిలువ రక్తములో నన్ను కడిగి – పాపమంతా పరిహరించిన
పావనుడగు నా ప్రభుయేసు
|| జై జై యేసురాజా ||
3. నీతి హీనుడనైన నాకు – నీతి రక్షణ వస్త్రములను
ప్రీతితో నొసగిన నీతి రాజా
|| జై జై యేసురాజా ||
4. మంటి పురుగునైన నన్ను – మంటి నుండి మింట జేర్చిన
మహాప్రభుండా నీకే జై జై
|| జై జై యేసురాజా ||
5. పాపశాపగ్రస్తుడనై యుండ – నన్ను గూడ నీ స్వకీయ
సంపాద్యముగా జేసితివి
|| జై జై యేసురాజా ||
6. రాజులైన యాజక గుంపులో – నన్ను గూడ నీ సొత్తైన
పరిశుద్ధ జనములో జేర్చితివి
|| జై జై యేసురాజా ||
7. తల్లియైన మరచిన మరచును – నేను నిన్ను మరువననిన
నమ్మకమైన నా ప్రభువా
|| జై జై యేసురాజా ||
8. అధిక స్తోత్రార్హుడవైన – ఆది యంతము లేని దేవా
యుగా యుగములకు నీకే జై జై
|| జై జై యేసురాజా ||