Jeevambu nitchina devudaa

Jeevambu nitchina devudaa
ne paadeda neeku nirantaramu
Halleluyaa Halleluyaa
paavanundaa neeku palumaaru
neninkemiyyanga paatrundanu
Halleluyaa Halleluyaa

1. Velugitchinaavu veligingchinaavu
gaalini maakai kaluga jesi
anudinamu maaku aahaaramitchi
oopiri posi kaapaaditivi – yenchaleka
nee manchi panulu Halleluyaa Halleluyaa
ani paadedan – hituda neeke ee stuti
geetamu – Halleluyaa Halleluyaa “Jeevambu”

2. Karuna kireeta mitchenani gadi gadiki
naatho nadichenani kopinchu vaadu
kaadanchu naa paapambu lella paatimpadu –
enchaleka nee manchi panulu
Halleluyaa Halleluyaa ani paadedan
hitudaa neeke ee stuti geetamu
Halleluya Halleluya “Jeevambu”

జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరము
హల్లెలూయా హల్లెలూయా
పావనుండా నీకు పలుమారు నేనింకేమియ్యంగ పాత్రుండను
హల్లెలూయా హల్లెలూయా

1. వెలుగిచ్చినావు వెలిగించినావు – గాలిని మాకై కలుగజేసి
అనుదినము మాకు ఆహారమిచ్చి – ఊపిరి పోసి కాపాడితివి
ఎంచ లేక నీ మంచి పనులు – హల్లెలూయా హల్లెలూయా అని పాడెదన్
హితుడా నీకే యీ స్తుతిగీతము – హల్లెలూయా హల్లెలూయా
|| జీవంబు ||

2. కరుణ కిరీట మిచ్చెనని – గడిగడికి నాతో నడిచేనని
కోపించువాడు కాడంచు నా – పాపంబులెల్ల పాటింపడు
ఎంచ లేక నీ మంచి పనులు – హల్లెలూయా హల్లెలూయా అని పాడెదన్
హితుడా నీకే యీ స్తుతిగీతము – హల్లెలూయా హల్లెలూయా
|| జీవంబు ||

Leave a Comment