Kontha samayame migilinadi – kristesu prabhuvu
thirigi vachun – leshamainanu jaagu cheyadu
1. Prabhu vachu varaku kanipettumu – nishchayamugaa
aayana vachunu – prabhu raaka nevaru preminthuro –
vaarini prabhuvu konipovunu “Kontha”
2. Aayana raakada sameepamu – sahavaasamulo
nilichi yundi prabhu vaakyamunaku lobadiyu –
aayana korakai kanipettedam “Kontha”
3. Adugantu chunnadi aatmeeyatha – andari premalu
challaaregaa kannulu therachi melconudi –
viduvabadina mee gathi yemagun “Kontha”
4. Thama swantha panulalo viswaasulu – kondaru
nidrinchu chunnaarugaa – melconu vaareththa baduduruviduva
badina vaari gathi yemagun “Kontha”
5. Novahu kaalamun smariyinthamu – samasthamunu
diddukoni vidudala dina maasanna maaye –
vimochanaa vishraanthi nitchu “Kontha”
కొంతసమయమే మిగిలినది
క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్
లేశమైనను జాగుచేయడు
1. ప్రభు వచ్చువరకు కనిపెట్టుము
నిశ్చయముగా ఆయన వచ్చును
ప్రభురాక నెవరు ప్రేమింతురో
వారిని ప్రభువు కొనిపోవును
|| కొంతసమయమే ||
2. ఆయన రాకడ సమీపము
సహవాసములో నిలిచియుండి
ప్రభు వాక్యమునకు లోబడియు
ఆయన కొరకై కనిపెట్టెదం
|| కొంతసమయమే ||
3. అడుగంటుచున్నది ఆత్మీయత
అందరి ప్రేమలు చల్లారెగా
కన్నులు తెరచి మేల్కొనుడి
విడువబడిన మీగతి యేమగున్
|| కొంతసమయమే ||
4. తమ స్వంత పనులలో విశ్వాసులు
కొందరు నిద్రించు చున్నారుగా
మేల్కొను వారెత్తబడెదరు
విడువ బడిన వారిగతి యేమగున్
|| కొంతసమయమే ||
5. నోవహు కాలమున్ స్మరియింతుము
సమస్తమును దిద్దుకొని
విడుదల దిన మాసన్నమాయె
విమోచనా విశ్రాంతి నిచ్చు
|| కొంతసమయమే ||