Kruthajnathan thalavanchi
naadu jeevamu arpintunu
lede ika ne eevi ila
arpintunu nanne neeku
1. Dooramaithi nee prema marachi
ne repiti nee gaayamul
dooramu ganika vellajaala
koorchundeda nee chentane “Krutha”
2. Aakarshinche lokaasha lanni
loka mahima nadda ginchu
korke lanni kristu premakai
nikkamugaa thyajintunu “Krutha”
3. Tharamula nee prema naakai
varnimpanu ashakyamu
nirantharamu sevinchinanu
theerchalenu nee runamu “Krutho”
4. Lokamukai jeevincha ninka
nee korakai jeevinthunu
nee karpimpan ne venudeeyan
ee koddi naa jeevitamu “Krutho”
5. Chintinchiti gatha paapamulakai
entho nenu edchu chunti
kruthajnathatho samarpintunu
brathu kanthayu nee sevakai “Krutho”
కృతజ్ఞతన్ తలవంచి – నాదు జీవము అర్పింతును
లేదే యిక నే యీవి యిల – అర్పింతును నన్నే నీకు
1. దూరమైతి నీ ప్రేమ మరచి – నే రేపితి నీ గాయముల్
దూరముగ నిక వెళ్ళజాల – కూర్చుండెద నీ చెంతనే
|| కృతజ్ఞతన్ ||
2. ఆకర్షంచె లేకాశలన్ని – లోక మహిమ నడ్డగించు
కోర్కెలన్ని క్రీస్తు ప్రేమకై – నిక్కముగా త్యజింతును
|| కృతజ్ఞతన్ ||
3. తరముల నీ ప్రేమ నాకై – వర్ణింపను అశక్యము
నిరంతరము సేవించినను – తీర్చలేను నీ ఋణము
|| కృతజ్ఞతన్ ||
4. లోకముకై జీవించనింక – నీ కొరకై జీవింతును
నీ కర్పింపన్ నే వెనుదీయన్ – ఈ కొద్ది నా జీవితము
|| కృతజ్ఞతన్ ||
5. చింతించితి గత పాపములకై – ఎంతో నేను యేడ్చుచుంటి
కృతజ్ఞతతో సమర్పింతును – బ్రతుకంతయు నీ సేవకై
|| కృతజ్ఞతన్ ||