Paraloka rajyamu cherutaku

Paraloka rajyamu cherutaku – prabhu Yesu margambu
marga satya jeevamu neneyani Yesu palkenu

1. Sarvalokula papa – pariharardamu sri Yesu
parisudha rakthamu chindinche – baliyayenu sri Yesu “Para”

2. Papapariharardam – papa rakthamu nichena
Yesuni chera priyuda – samsayamadiyela “Para”

3. Nenu preminche pranamu – nekai pettina Yesune
naku valadanchu velluta – nyayama priyuda “Para”

4. Maraninchina Yesu prabhuvu – mudavanadu lechenu
mahima prabavamuto Yesu – maranamu gelchenu “Para”

5. Takshaname maaru manassu – nondi Yesuni nammina
rakshana nondedavu – nichayamugano – priyuda “Para”

పరలోక రాజ్యము చేరుటకు – ప్రభుయేసే మార్గంబు
మార్గ సత్య జీవము నేనేయని యేసే పల్కెను

1. సర్వలోకుల పాప – పరిహారార్థము శ్రీ యేసు
పరిశుద్ధ రక్తము చిందించి – బలియాయెను శ్రీ యేసు
|| పరలోక ||

2. పాపపరిహారార్థము – పావన రక్తము నిచ్చిన
యేసుని చేర ప్రియుడా – సంశయమదియేల
|| పరలోక ||

3. నిను ప్రేమించి ప్రాణము – నీకై పెట్టిన యేసుని
నాకు వలదంచు వెళ్ళుట – న్యాయమా ప్రియుడా
|| పరలోక ||

4. మరణించిన యేసు ప్రభువు – మూడవనాడు లేచెను
మహిమా ప్రభావముతో యేసు – మరణము గెల్చెను
|| పరలోక ||

5. తక్షణమే మారు మనస్సు – నొంది యేసును నమ్మిన
రక్షణ నొందెదవు – నిశ్చయముగనో – ప్రియుడా
|| పరలోక ||

Leave a Comment