Parugidara sodaruda

Parugidara sodaruda – prabhu sannidi neevu jerutakai

1. Yugasamaptiki aagamanamunaku –
suchanalenno choodumuraa
vedanalenno meediki vachchuraa –
kalavaramondaka kanipettumura “Paru”

2. Indlanu gattuchu pendliki ichchuhu –
naarunu naatuchu traaguchu tinuchu
jagamulo janulu digulu lenappudu –
dongavale ila doravai vachura “Paru”

3. Aa dinamainanu aa gadiyainanu –
paramuna dootalu dharanilo manujulu
yevarunugaani erugane erugaru –
melakuvatho Yesu pilupunu vinuchu “Paru”

4. Aa dinamula sharma anthamu kaagaa –
suryuni chandruni chikati kammu
akasamandali shaktulu kadalunu –
mahimato Yesu immahidiguraa “Paru”

5. Arbaatamutho aashcharyamutho –
devuni bhoorato mana prabhu digura
kristu nandunna mrutulaguvaaru –
ekamuga prabhu Yesuni jera “Paru”

6. Yetuchuchina neekatu kanipinchunu –
kondala bandala nundinanu
kodama simhamai kopagniyai –
yeduruga vachina kadalaga levura “Para”

7. Eththabaduta kayathamaa neevu –
tarunamu idiyethadavu cheyakura
rakshanalo nireekshana kaligi –
rakshaku desuni rajyamu chera “Para”

పరుగిడిరా సోదరుడా – ప్రభు సన్నిధి నీవు జేరుటకై

పల్లవి : యుగసమాప్తికి ఆగమనమునకు
సూచన లెన్నో చూడుమురా
వేదన లెన్నో మీదికి వచ్చురా
కలవర మొందక కని పెట్టుమురా

1. ఇండ్లను గట్టుచు పెండ్లికి యిచ్చుచు
నారును నాటుచు త్రాగుచు తినుచు
జగములో జనులు దిగులు లేనప్పుడు
దొంగవలె యిల దొరయై వచ్చురా
|| యుగసమాప్తికి ||

2. ఆ దినమైనను ఆ గడియైనను
పరమున దూతలు ధరణిలో మనుజులు
ఎవరునుగాని ఎరుగనె ఎరుగరు
మెలకువతో యేసు పిలుపును వినుచు
|| యుగసమాప్తికి ||

3. ఆ దినముల శ్రమ అంతము కాగ
సూర్యుని చంద్రుని చీకటి కమ్ము
ఆకసమందలి శక్తులు కదలును
మహిమతో యేసు యిమ్మహిదిగురా
|| యుగసమాప్తికి ||

4. ఆర్భాటముతో ఆశ్చర్యముతో
దేవుని బూరతో మనప్రభు దిగురా
క్రీస్తు నందున్న మృతులగువారు
ఏకముగ ప్రభు యేసుని జేర
|| యుగసమాప్తికి ||

5. ఎటుచూచిన నీకటు కనిపించును
కొండల బండల నుండినను
కొదమ సింహమై కోపాగ్నియై
ఎదురుగ వచ్చిన కదలగ లేవురా
|| యుగసమాప్తికి ||

6. ఎత్తబడుట కాయత్తమా నీవు
తరుణము యిదియే తడవు చేయకురా
రక్షణలో నిరీక్షణ కలిగి
రక్షకు డేసుని రాజ్యము చేర
|| యుగసమాప్తికి ||

Leave a Comment