Prabhu goppa kaaryamulu chesenani
mana mutsahinchedamu – prabhu goppa melula
varshamu manapai kuripinche nahaa –
A. P. : Aha storamu storamulu – intavaraku kaache
paatrulamugaa sevinthumu –
1. Daiva kaaryamulu janamula madya – prasiddhi
cheyudamu – devuni aashcharya kaaryamu
manalo – dhyaninchi paadedamu “Aha”
2. Sangeetha gaanamulathonu – sannuthinchuchu
prabhuni sitaara swara mandalamulatho –
mana marbhaatinchedamu “Aha”
3. Mana bhaaramulanniyu tholaginchi – ghana
kaaryamulanu jese – dinamella paaduchu –
ghana parachi – chaatinchedamilalo “Aha”
4. Nootana kaarayamulu cheyuvaadu prabhu
vaashcharya karudu – balamagu kaarayamulu
cheyu vaadaayane dhairyamugaa paadedam “Aha”
5. Premaa soundaryamulu gala vaadu kshemamu
nitchuvaadu – mahimaishwaryamulu
galavaadaayane – mahini bogadedamu “Aha”
6. Mana kenno vahgdaanamuliche mana
manubhavinchitimi – ghanathaa mahima
prabhaavamu prabhunake – Halleluyaa aamen “Aha”
ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము
ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా
అనుపల్లవి : ఆహా స్తోత్రము స్తోత్రములు – ఇంతవరకు కాచె
పాత్రులముగా సేవింతుము
1. దైవ కార్యములు జనముల మధ్య – ప్రసిద్ధి చేయుదము
దేవుని ఆశ్చర్య కార్యము మనలో – ధ్యానించి పాడెదము
|| ప్రభు ||
2. సంగీత గానములతోను – సన్నుతించుచు ప్రభుని
సితార స్వరమండలములతో – మన మార్భాటించెదము
|| ప్రభు ||
3. మన భారములన్నియు తొలగించె – ఘనకార్యములను జేసె
దినమెల్ల పాడుచు ఘనపరచెదము – చాటించెద మిలలో
|| ప్రభు ||
4. నూతన కార్యములు చేయువాడు – ప్రభు వాశ్చర్యకరుడు
బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడెదం
|| ప్రభు ||
5. ప్రేమా సౌందర్యములు గలవాడు – క్షేమము నిచ్చువాడు
మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిని బొగడెదము
|| ప్రభు ||
6. మనకెన్నో వాగ్దానము లిచ్చె మన మనుభవించితిమి
ఘనతా మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమెన్
|| ప్రభు ||